Begin typing your search above and press return to search.
ఇలాంటివి పవన్లో మాత్రమే కనిపిస్తాయి
By: Tupaki Desk | 3 Jan 2017 7:08 AM GMTఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా.. ఇష్యూ బేస్డ్ రాజకీయాల్ని చేయటం.. ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యల్ని తెర మీదకు తీసుకురావటం.. వాటి పరిష్కారం కోసం పోరాడటం.. సమస్యలకు ప్రచారం కల్పించి.. ప్రభుత్వం వాటి పరిష్కారం కోసం ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాన్ని పవన్ ఇప్పుడు చేపట్టినట్లుగా కనిపిస్తోంది. అయితే.. ఇలాంటి ప్రయత్నాలు చేపట్టినప్పుడు.. వీలైనంత పొలిటికల్ మైలేజీ కోసం నేతలు పాకులాడటం కనిపిస్తుంది.
కానీ.. పవన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం.. తనను పొగిడే వారిని వారించటం.. అలాంటివి వద్దని చెప్పటం లాంటివి అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అంతేనా.. బాధితుల పట్ల అంతులేని కరుణను.. దయను ప్రదర్శించే వైనం కాస్తంత కొత్తగా ఉంటుందని చెప్పాలి. ఇలాంటివన్నీ పవన్ లో తప్పించి.. మిగిలిన రాజకీయ అధిపతుల్లో కనిపించవనే చెప్పాలి.
ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యల మీదన తన దృష్టి ఉంటుందన్న విషయాన్ని చేతల్లో చెబుతున్న పవన్.. కొత్త తరహా రాజకీయాల్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారనే చెప్పాలి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ సమస్యను తెర మీదకు తీసుకొచ్చిన పవన్ పుణ్యమా అని.. ఈ రోజు ఈ ఇష్యూపై చర్చ సరికొత్తగా మొదలైంది.
కేవలం పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంత భారీగా ప్రజలు ఒక ప్రాంతంలో మరణించటంపై ఇప్పుడు పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో.. వేదిక మీద ఈ ఇష్యూ గురించి మాట్లాడిన కొందరు(వారంతా ఈ సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్న బాధితులకు సాయం అందించేవారే) పవన్ ను పొగిడే పని పెట్టుకోగా.. సున్నితంగా వారించిన వైనం స్పష్టంగా కనిపించింది. ఉద్దానం ప్రాంతంలో పరిశుభ్రమైన తాగునీరును అందిస్తున్న వీనం ఫౌండేషన్ కు చెందిన ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ సమస్యపై దృష్టి సారించిన పవన్ ను పొగిడే పని మొదలు పెట్టారు. వెంటనే స్పందించిన పవన్.. ఆయన్ను వారిస్తూ.. సమస్య గురించి మాత్రమే ప్రస్తావించాలని.. పొగడ్తలు వద్దని చెప్పటంతో.. ఆయన డైరెక్ట్ గా పాయింట్ లోకి వెళ్లారు. ఇవాల్టి రోజున రూపాయి ఖర్చు చేస్తే పది రూపాయిల పేరు ప్రఖ్యాతులు కోరుకునే నేతలకు భిన్నంగా పవన్ లాంటోళ్లు చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి విలక్షణత పవన్ లో మాత్రమే కనిపిస్తాయనిచెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/