Begin typing your search above and press return to search.
పవన్ సంచలనం.. గాజువాకలో నివాసం
By: Tupaki Desk | 30 March 2019 11:55 AM GMTప్రత్యర్థులకు జనసేనాని పవన్ కళ్యాన్ శనివారం అదిరిపోయే షాక్ ఇచ్చాడు. పవన్ నాన్ లోకల్ అంటూ గాజువాకలో గెలిస్తే ఈయన పట్టించుకోడని ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు గాజువాకలో పవన్ ను ఎండగడుతున్న విషయం తెలిసిందే.. పవన్ స్థానికుడు కాదని.. ఏదైనా అవసరం వస్తే హైదరాబాద్ వెళ్లి అడుగుతారా అని.. పవన్ ను గెలిపిస్తే మీకే కష్టం అంటూ ప్రత్యర్థులు పవన్ స్థానికతపై పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టి గాజువాకలో నానా హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కౌంటర్ ఇస్తూ పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు..
తాజాగా గాజువాకలోని చినగంట్యాడ శ్రీకృష్ణ దేవరాయ నగర్ లో పవన్ తన స్థిర నివాసం కోసం డూప్లెక్స్ గృహాన్ని ఎంపిక చేసుకున్నారు. ఎటువంటి భద్రత ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆ నివాసాన్ని కొన్ని ఏళ్లకు అద్దెకు తీసుకున్నారు. గాజువాకను సొంత నియోజకవర్గం మార్చుకుంటానని.. అందుకే ఇక్కడ ఇల్లు తీసుకున్నానని పవన్ శనివారం ప్రకటించారు.
కాగా శనివారం ఇక్కడి నుంచే పవన్ ప్రచారం ప్రారంభించడం విశేషం. తాను ఇక పార్టీ కార్యకలాపాలు ఇంటినుంచే చేస్తానని తెలిపారు. కాగా పవన్ కోసం గాజువాకలో ఇంటిని జనసేన రాష్ట్ర కమిటీ సభ్యులు హరిప్రసాద్, శివశంకర్ లు చూసి ఎంపిక చేశారు. స్థానిక పోలీస్ అధికారులు కూడా ఇంటిని పరిశీలించి ఓకే చేయడంతో పవన్ గాజువాక ఇల్లు సిద్ధమైంది. ఇలా పవన్ నాన్ లోకల్ విమర్శలకు ఏకంగా ఇంటిని ఎంపిక చేసుకొని ప్రత్యర్థులకు గట్టి షాక్ ఇచ్చారు.