Begin typing your search above and press return to search.

ఓడితే గానీ... పీకేకు జ్ఞానోద‌యం కాలేద‌బ్బా!

By:  Tupaki Desk   |   25 Jun 2019 9:28 AM GMT
ఓడితే గానీ... పీకేకు జ్ఞానోద‌యం కాలేద‌బ్బా!
X
ఎవ‌రికైనా గెలుపు క‌న్నా... ఓట‌మే మంచి గుణపాఠం అవుతుంద‌ని మ‌రోమారు రుజువు అయ్యింద‌నే చెప్పాలి. వ‌చ్చీ రాగానే గెలుపు ద‌క్కితే నిజంగానే క‌ళ్లు నెత్తికెక్కుతున్న ప్ర‌స్తుత కాలంలో తాజా ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి దిగిన జ‌న‌సేన పార్టీకి ఘోర ప‌రాభవం ఎదురైతే... ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మాత్రం ఇది ఓ మంచి గుణ‌పాఠంలా నిలిచింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 130కి పైగా స్థానాల్లో పోటీ చేస్తే... తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓట‌మితో పాటు ఒక్క సీటు మిన‌హా అన్ని స్థానాల్లో ఓట‌మి ద‌క్క‌డంతో ప‌వ‌న్ కు నిజంగానే షాక్ త‌గిలింద‌ని చెప్పాలి. ఓట‌మి నుంచి తేరుకునేందుకు కాస్తంత స‌మ‌య‌మే ప‌ట్టిన‌ప్ప‌టికీ... మ‌ళ్లీ ప్ర‌జాక్షేత్రంలోకి వ‌చ్చిన ప‌వ‌న్‌... చాలా ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. అంతేకాకుండా త‌న ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను కూడా ఆయ‌న విశ్లేషించుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో నిన్న మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యానికి వ‌చ్చిన ఆయ‌న పార్టీలో ప‌లు నూత‌న క‌మిటీల‌ను ఆయా క‌మిటీల్లో నూత‌న స‌భ్యుల‌ను ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న త‌న ఓట‌మితో పాటు పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను కూడా బాగానే విశ్లేషించారు. గ్రామ స్థాయిలో ప‌ట్టు సాధించ‌లేని కార‌ణంగానే తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వం ఎదురైంద‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. అయితే ఒక్క ఓట‌మితోనే అంతా అయిపోలేద‌ని - తాను ఇంతకుముందు చెప్పిన‌ట్టుగానే ఓడినా కూడా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకునేది లేద‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను అంతా గుర్తించాల‌ని - ఇవే కార‌ణాల‌ను భ‌విష్య‌త్తులో పున‌రావృతం కాకుండా చూసుకోవాల‌ని కూడా ఆయ‌న పార్టీ శ్రేణుల‌కు సూచించారు.

గ్రామ స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గానే కొత్త‌గా క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని - ఈ క‌మిటీలు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా గ్రాస్ రూట్ లెవెల్ దాకా వేస్తామ‌ని ప‌వ‌న్‌ ప్ర‌క‌టించారు. పార్టీలో అనుభవం ఉన్న నేత‌లు చాలా మంది ఉన్నార‌ని - వారి సేవ‌ల‌ను మ‌రింత మేర ఉప‌యోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. మొత్తంగా ఓట‌మి ద‌క్కితే గానీ... గ్రాస్ రూల్ లెవెల్ ప‌వ‌న్ కు గుర్తుకు రాలేద‌న్న మాట‌. స‌రే... ఇప్ప‌టికీ మించిపోయింది ఏమీ లేదు గానీ.. . నిజంగానే ప‌వ‌న్ ఇప్పుడు చెబుతున్న‌ట్టుగా గ్రాస్ రూల్ లెవెల్ నుంచి ప‌టిష్టం చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా జ‌న‌సేన‌కు మంచి అవ‌కాశాలే ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.