Begin typing your search above and press return to search.

చంద్రబాబు, జగన్ లను అధిగమించిన పవన్ కళ్యాణ్

By:  Tupaki Desk   |   27 Dec 2022 11:30 AM GMT
చంద్రబాబు, జగన్ లను అధిగమించిన పవన్ కళ్యాణ్
X
అన్ని రాజకీయ పక్షాలకు ప్రజా బలం ఉంటే.. పవన్ కళ్యాణ్ కు దాంతోపాటు అంతకుమించిన ‘సోషల్’ బలం ఉంది. ఇప్పుడు నరేంద్రమోడీ నుంచి గల్లీ లీడర్ వరకూ అంతా సోషల్ మీడియాలోనే పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాను ప్రజలకు చేరువ చేసి దాన్నో ఆయుధంగా మార్చేస్తున్నారు.

నరేంద్రమోడీ ప్రస్తుతం దీన్నే బలంగా వాడుతూ ప్రతిపక్షాలకు అందనంత దూరంలో ఉంటున్నారు. సోషల్ మీడియాను బాగా వాడి మోడీ పాపులర్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇప్పుడు అందరికంటే మిన్నగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. చంద్రబాబు, జగన్ లు కూడా సోషల్ మీడియాలో ఉన్నా వాళ్లు పోస్టులు పెట్టేది చాలాతక్కువ. స్వయంగా వాళ్లు వాడరు. వాళ్ల టీం పోస్టులు పెడుతుంటుంది. కానీ పవన్ స్వయంగా జనసేన వ్యవహారాలు, సినిమా సంగతులు పంచుకుంటాడు.

ఏపీకి సంబంధించిన రాజకీయనేతల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో అందరికంటే ఎక్కువ ఫాలోవర్లను కలిగి ఉన్న వారిలో అందరికంటే టాప్ లో ఉన్నారు.జనసేనాని ట్విటర్ ఫాలోవర్స్ సంఖ్య 5.2 మిలియన్లుగా ఉంది. ఈ జాబితాలో రెండో స్థానంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఉన్నారు.

చంద్రబాబు ట్విటర్ ఫాలోవర్స్ సంఖ్య 4.9 మిలియన్లు. 2009లోనే ట్విటర్ ఖాతా ప్రారంభించిన చంద్రబాబు 60 సంవత్సరాల వయసు దాటిన యువతతో పోటీపడుతూ ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. ఇక ఫాలోవర్ల విషయంలో సీఎం జగన్ మూడో స్థానంలో ఉన్నారు. ఆయనకు ట్విటర్ లో 2.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

పవన్ కళ్యాణ్ కు ఎక్కువ ఫాలోవర్లు ఉండడానికి కారణం ఆయన సినిమా రంగంతోపాటు రాజకీయ రంగంలోనూ ఉండడమే. రెండు రంగాలను బ్యాలెన్స్ చేస్తున్నారు. ేడాదిగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. తరుచుగా ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. దీంతో ఫాలోవర్లు క్రమంగా పెరుగుతున్నారు.

రాజకీయంగా బలమైన మీడియా ఉండాలి. లేదంటే సోషల్ మీడియాలో అయినా బలంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ కు మీడియా సపోర్టు తక్కువగా ఉన్నా ఆయన ఈ సోషల్ మీడియాతోనే బలంగా ముందుకెళుతున్నారు. తన వాయిస్ ను వినిపిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.