Begin typing your search above and press return to search.

మహనీయుల్లోనూ పవన్ కు క్లారిటీ లేదా!

By:  Tupaki Desk   |   12 March 2018 9:23 AM GMT
మహనీయుల్లోనూ పవన్ కు క్లారిటీ లేదా!
X
పవన్ కల్యాణ్ మేనరిజం అంటూ సినిమాల్లోచాలా మంది కమెడియన్లు పదేపదే ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఆ మేనరిజం ఏంటంటే.. నిలకడ లేకుండా.. ఒక చోట స్థిరంగా ఉండకుండా.. అలా ఊగుతూ.. కదులుతూ ఉండడం. ఆయన బాడీ లాంగ్వేజీలో మేనరిజం మాత్రమే కాదు.. ఆయన ఆలోచన సరళిలో కూడా అదే మేనరిజం ఉన్నదేమో అనిపిస్తుంది. పవన్ కల్యాణ్ ఏ విషయంలో ఎప్పుడు ఎలాంటి ఉత్తేజానికి గురవుతారో.. ఎందుకు ఎలాంటి ఉద్యమాల్ని టేకప్ చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. ఆయనలోని ఆలోచనల్ని డ్రైవ్ చేసే వ్యక్తులు ఎవరో ఉంటారు... వారి పొడ బయటకు తెలియనివ్వడు.. ఆ రకంగా.. అంతా తనే అన్నట్లు వ్యవహరిస్తుంటాడు.. అది కాస్తా తరచూ బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటుంది.

ఇప్పుడు పవన్ కల్యాణ్ తెలుగుజాతి మహనీయులు అంటూ జిల్లాకు ముగ్గురు వంతున ఎంపిక చేసి తెలుగు రాష్ట్రాలకు కలిపి 49 మందిని లిస్టుగా రూపొందించేశారు.

తాను ఇప్పటికి ఎన్ని సభలు నిర్వహించినా.. దీనిని కాస్త విభిన్నంగా గ్రాండ్ స్కేల్ పొలిటికల్లీ బ్యాంగ్ లాగా నిర్వహించదలచుకుంటున్నప్పుడు.. పవన్ కల్యాణ్.. మహనీయులను త్యాగధనులను స్మరించుకోవాలని అనుకోవడం.. గొప్ప సంగతి. అందుకు ఆయనను అభినందించాలి. కానీ త్యాగధనులకు మహనీయులకు ర్వైల్వే బెర్తుల్లాగా ఒక కోటా డిసైడ్ చేసి.. కోటా పూర్తయ్యాక.. ఇక మహనీయులే ఉండరాదని అంటే ఎలాగ? ఆ అంశమే ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.

జిల్లాకు ముగ్గురు మహనీయులే పవన్ దృష్టిలో పడ్డారు. అందులో వీలైనంత వరకు ఆయన కులాల తూకం పాటించడానికి చూశారు తప్ప.. ప్రజాజీవితం ప్రాతిపదికనా.. వారి వారి అభిరుచులు - కళల్లో పాండిత్యం ప్రకారం గొప్పవాళ్లా అనేది పట్టించుకోలేదు. ఫరెగ్గాంపుల్ వయోలిన్ వాయించే మహనీయుడు ఉన్నారనుకుందాం.. వయోలిన్ ప్రియులకు ఆయన దేవుడే.. కానీ.. ఆయన వయోలిన్ నాదం వలన... ఆకలేసిన సగటుజీవికి కడుపు నిండుతుందా? పేదల కడుపు నింపడానికి ఆయన ఏమైనా పాటుపడ్డారా? పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో ఎవరిని మహనీయులుగా - ఎవరిని ఆదర్శమూర్తులుగా ఎంచుకోదలచుకున్నారు? ఆయనకు అసలు క్లారిటీ ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జిల్లాల్లో కూడా.. మా జిల్లాలో మహనీయులు ఈ ముగ్గురేనా.. మిగిలిన వాళ్లంతా పనికిరానివాళ్లని మీరు డిసైడ్ చేసినట్టేనా? అనే విమర్శలు వస్తున్నాయి.

పైగా పవన్ పాల్గొనే ప్రధాన వేదిక బ్యాక్ డ్రాప్ పోస్టర్ లో కేవలం ముగ్గురు తెలుగువారి ఫోటోలుంటాయి. ప్రకాశం పంతులు - పొట్టి శ్రీరాములు - బూర్గుల రామకృష్ణారావు.. మాత్రమే. ఇదే అగ్రవర్ణపు జాడ్యాన్ని ప్రోత్సహించినట్లున్నదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. త్యాగమూర్తులకు కులాల రంగు పులమడం అలా ఆలోచించడం నీచమైన విషయమే.. కానీ.. అలాంటి ప్రతివాదనతో.. ఇతర కులాల్లోని అనేక మంది మహనీయుల్ని విస్మరించడం పాపం అనికూడా పలువురు వాదిస్తున్నారు.

అసలే ఇవాళ్టికి రేపటికి ఏ విషయంలోనూ ఏకరీతిగా ఆలోచించే అలవాటు లేని పవన్ కల్యాణ్ ఈ విమర్శలను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.