Begin typing your search above and press return to search.
మాకు ఒక లెక్క ..జగన్ ఢిల్లీ టూర్ పై పవన్ కామెంట్ !
By: Tupaki Desk | 15 Feb 2020 11:50 AM GMTఏపీలో రాజకీయాలు చాలా వేగంగా మార్పు చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత , సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుసగా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అవుతుండటంతో వైసీపీ బీజేపీ పొత్తు పెట్టుకోనున్నాయి అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ పొత్తు వ్యవహారంపై జరుగుతున్న ప్రచారం పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ అధికారపార్టీతో జతకడితే మీరేం చేస్తారంటూ మీడియా ప్రశ్నించడం తో ...ఏపీలో బీజేపీ తో జనసేన బంధం చాలా ధృడంగా ఉందని, త్వరలోనే బీజేపీతో కలిసి ఉద్యమాలు నడుపుతానన్న ధీమా వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.
రాజధాని విషయంలో బీజేపీ క్లారిటీ ఇచ్చిన తర్వాతనే తాను కమలం నేతలతో కలిసానని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. త్వరలోనే బీజేపీ నేతలతో కలిసి రాజధాని ప్రాంతంలో పర్యటనకు వస్తానని చెప్పారు పవన్ కల్యాణ్. ఢిల్లీలో జగన్ కలుస్తున్నది భారతీయ జనతాపార్టీ నేతలను కాదు, అని ఆయన భారతీయ ప్రభుత్వ అధినేతలను కాబట్టి అందులో వేరే ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదని పవన్ తెలిపారు.
కాగా, అమరావతి ఏరియా రైతాంగానికి హామీ ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ శనివారం ఆ ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటనకు వెళ్ళారు. భారీ ఎత్తున వచ్చిన జనసేన శ్రేణులతో కలిసి రాజధాని ఏరియాలోని తుళ్ళూరు, మందడం, ఉద్దండరాయుని పాలెం వంటి గ్రామాల్లో ఉన్న రైతులని కలిసి, వారి భాగోగులని అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. అలాగే ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో కేంద్రం కూడా కొన్ని విషయాల్లో ఏమీ చేయలేని పరిస్థితులుంటాయని అన్నారు.