Begin typing your search above and press return to search.
ఏలూరులో పవన్ కళ్యాణ్.. సడెన్ గా పెద్ద సమస్య.. ఏం జరిగిందంటే..
By: Tupaki Desk | 23 April 2022 2:30 PM GMTఏలూరు పర్యటనలో జనసేనాని పవన్ కళ్యాణ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారుకు సడెన్‌గా పంక్చర్ పడింది. దీంతో భద్రతా పరమైన ఇబ్బందులు కూడా తలెత్తాయి. హుటాహుటిన అధిక సంఖ్యలో అక్కడకు చేరుకున్న పోలీసులు.. అభిమానులను నిలువరించారు. అయితే.. రోడ్లపై గుంతల కారణంగానే పవన్ టైరుకు పంక్ఛర్ పడిందని.. కొందరు అభిమానులు విమర్శించారు. అయితే.. జనసేన వర్గాలు ఆ వ్యాఖ్యలను ఖండించాయి.
పర్యటన సాగిందిలా..జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఏలూరు జిల్లాలో.. కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. జిల్లాకు వచ్చిన ఆయనకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. గజమాలతో ఘన స్వాగతం పలికారు.
పెదవేగి మండలం విజయరాయిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జున కుటుంబాన్ని.. పవన్ పరామర్శించారు. మృతుని భార్యకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ నేపథ్యం వివరాలను అడిగి తెలుసుకుని.. తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
అంతకుముందు పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు.. భారీగా అభిమానులు, జనసైనికులు తరలివచ్చారు. గజమాలతో అధినేతకు స్వాగతం పలికారు. ఈ క్రమంలో దుగ్గిరాల వద్ద పవన్ కాన్వాయ్‌ను అనుసరిస్తున్న బైక్‌ను.. కారు ఢీకొంది.
దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తికి గాయాలవ్వగా.. ఆస్పత్రికి తరలించారు. లింగపాలెం వద్ద పవన్ ప్రయాణిస్తున్న కారుకు పంక్చర్ అయ్యింది. పంక్చర్ వేసేవరకు.. పవన్ కల్యాణ్ ఆక్కడే ఉండి పర్యటన కొనసాగిస్తున్నారు.
లింగపాలెం మండలం ధర్మాజీగూడెం, చింతలపూడి మండలంలో ఆత్మహత్య చేసుకున్న పదకొండు రైతు కుటుంబాలను.. పవన్ పరామర్శించనున్నారు. అదేవిధంగా రచ్చబండ సభలో పవన్ పాల్గొని ప్రసంగించనున్నారు. గతంలోనూ పవన్ అనంతపురంలో కౌలు రైతు కుటుంబాలను పరామర్శించిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది పాటు.. పవన్ ఇదే యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు.