Begin typing your search above and press return to search.

మాట ఇవ్వ‌ట‌మే కానీ గుర్తుంచుకోవా ప‌వ‌న్‌?

By:  Tupaki Desk   |   2 April 2017 12:32 PM GMT
మాట ఇవ్వ‌ట‌మే కానీ గుర్తుంచుకోవా ప‌వ‌న్‌?
X
ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టాన‌ని చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఎంత‌లా ప్ర‌శ్నించారో తెలిసిన విష‌య‌మే. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా నిర‌స‌న యుద్ధం చేస్తాన‌ని చెప్పి.. హ‌డావుడిగా మూడు స‌భ‌లు నిర్వ‌హించిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఆ మాటే ఎత్త‌క‌పోవ‌టం మ‌ర్చిపోకూడ‌దు. విష‌యం ఏమైనా మొక్కుబ‌డిగా ప్ర‌స్తావించ‌టం.. ఏదేదో చేస్తాన‌ని మాట ఇవ్వ‌టం.. త‌ర్వాత ఆ విష‌యాన్ని మ‌ర్చిపోవ‌టం మామూలుగా మారింది. ఆ మ‌ధ్య‌న అనంత‌పురంలో నిర్వ‌హించిన స‌భ‌లో.. తాను జిల్లాలో ప‌ర్య‌టిస్తాన‌ని.. క‌ర‌వు మీద పాద‌యాత్ర చేస్తాన‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కూ అత్తాలేదు ప‌త్తా లేదు.

అదేనా.. ఆ మ‌ధ్య‌న ప్ర‌త్యేక హోదా కోసం ఎంత‌కైనా రెఢీ అంటూ ఘీంక‌రించిన ప‌వ‌న్‌.. త‌ర్వాతి కాలంలో విశాఖ వేదిక‌గా చేసుకొని మౌన‌దీక్ష చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా.. ప్ర‌త్యేకంగా పాట‌ల ఆల్బ‌మ్‌ను రిలీజ్ చేస్తాన‌ని చెప్పినా.. అవేమీ స‌క్సెస్ కాలేదు. చివ‌ర‌కు.. పాట‌ల రిలీజ్‌ ను మ‌ధ్య‌లో నిలిపివేశారు. ఆ విష‌యాన్ని కాసేపు ప‌క్క‌న పెడితే.. జ‌ల్లిక‌ట్టు స్ఫూర్తిగా విశాఖ ఆర్కే బీచ్‌ లో నిర్వ‌హించే మౌన‌దీక్ష కోసం తానే స్వ‌యంగా రంగంలోకి దిగ‌నున్న‌ట్లుగా చెప్పి.. త‌ర్వాత తుస్ మ‌నిపించిన ఆయ‌న‌.. మార్చిలో దీక్ష చేస్తాన‌ని ట్వీట్ చేశారు.

ప‌వ‌న్ నోటి నుంచి మాట వ‌చ్చిందంటే జ‌రిగితీరుతుంద‌న్న న‌మ్మ‌కం లేని దానికి త‌గిన‌ట్లే.. ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జ‌న‌వ‌రి పోయి ఫిబ్ర‌వ‌రి పూర్తి అయి.. మార్చి కూడా గ‌డిచిపోయినా.. తాను చేస్తాన‌ని చెప్పిన ధ‌ర్నాను ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని ప‌రిస్థితి. ప‌వ‌న్ వైఖ‌రికి ఆయ‌న అభిమానులు కూడా ఇప్పుడు డిఫెన్స్ లో ప‌డిపోతున్నారు.

నిన్న‌టి వ‌ర‌కూ హోదా విష‌యంలో త‌మ నాయ‌కుడు ఏదో ఒక‌టి చేస్తాడ‌న్న మాట‌ను బ‌లంగా చెప్పిన వారు సైతం.. ఇప్పుడేమీ మాట్లాడ‌లేక‌పోతున్నారు. త‌మ అధినేత చెప్పే మాట‌ల‌కు.. చేసే చేత‌ల‌కు సంబంధం ఉండ‌టం లేద‌న్న అభిప్రాయాన్ని ప‌వ‌న్ అభిమానులు కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంపై ఎలుగెత్తిన ప‌వ‌న్‌.. ఇప్పుడు అందుకు భిన్నంగా టోన్ డౌన్ చేసిన అభిప్రాయం క‌లుగుతుంద‌న్న మాట వినిపిస్తోంది. లేకుంటే.. ట్వీట్‌లో చెప్పిన‌ట్లుగా మార్చిలో చేయాల్సిన దీక్ష ఎందుకు చేయ‌లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/