Begin typing your search above and press return to search.

పవన్ అసహనం... ఏమిటీ కారణం...!?

By:  Tupaki Desk   |   25 Nov 2018 4:43 AM GMT
పవన్ అసహనం... ఏమిటీ కారణం...!?
X
పవన్ కల్యాణ్. నిన్నడి దాకా సినీ హీరో. ప్రస్తుతం ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షడు. ఆయన చెబుతున్నట్లుగా జరిగితే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతానంటున్న నాయకుడు. ఇక్కడి వరకూ అంతా సేమ్ టు సేమ్. ఇక్కడి నుంచే ఆయన లెక్క లేని తిక్కకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా. ఏం లేదు. పవన్ కల్యాణ్ కి కోపం వచ్చింది. కాదు కాదు అసహనం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం పై పవన్ కల్యాణ్ ప్రవర్తించిన తీరు అందరినీ విస్మరియానికి గురి చేస్తోంది.

"ఏదో చిన్న కత్తితో... అది కూడా కోడి కత్తితో చిన్న గాయం అయితే గడచిన ఇరవై రోజులుగా జగన్ రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి పనులు మా పార్టీ చేయదు" అని పవన్ కల్యాణ్ అన్నారు. అంతే కాదు.... తన కాన్వాయ్ ప్రమాదానికి గురైందని, ఆ సమయంలో అందులో ఉన్న ఎనిమిది మందికి గాయాలయ్యాయని, ఆ తర్వాత తన కారు కూడా ప్రమాదానికి గురైందని, అయినా తాను వాటిని రాజకీయం చేయలేదంటూ విమర్శలు సంధించారు. దీనిపై రాజకీయ విమర్శకులే కాదు.... ప్రజలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఓ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ నాయకుడు ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నిస్తున్నారు. "ఇలాంటి ప్రకటనలు చేయడం అంటే ప్రజలను రెచ్చగొట్టడమే" అని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కల్యాణ్ తన పర్యటనలో ప్రజల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఇలా మాట్లాడుతున్నారా అని అంటున్నారు. మరోవైపు తన పై కాని, తన జనసేనానుల పై కాని ఎలాంటి దాడులు జరిదినా దీనికి నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ డీజీపీదేనని పవన్ కల్యాణ్ చెప్పడం కూడా విమర‌్శలకు గురవుతోంది. తన పై దాడి జరిగితే ఒక విధంగా ప్రతిపక్ష నేత పై జరిగితే మరోవిధంగా స్పందించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ లో నానాటికీ సహనం కోల్పోతున్నారని, ఇది ఆయన రాజకీయ భవిష్యత్ కు అంత మంచిది కాదని పలువురు రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.