Begin typing your search above and press return to search.

న‌న్ను క‌లిసిన వారంతా ఓట్లు వేయ‌రు:ప‌వ‌న్

By:  Tupaki Desk   |   25 Sep 2018 2:30 PM GMT
న‌న్ను క‌లిసిన వారంతా ఓట్లు వేయ‌రు:ప‌వ‌న్
X
ప్ర‌భుత్వంలో జ‌రిగే అవినీతిని - అన్యాయాల‌ను ప్ర‌శ్నిస్తాన‌ని జ‌న‌సేనను సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన సంగ‌తి తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో ప‌వ‌న్ పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల మద్ద‌తు త‌న‌కు కావాల‌ని....రాబోయే ఎన్నిక‌ల్లో త‌న‌ను సీఎంను చేస్తే....ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని ప‌వ‌న్ ప‌లుమార్లు చెప్పారు. అయితే - సినీ హీరో అయిన ప‌వ‌న్ ను చూసేందుకు జ‌నం వ‌స్తున్నార‌ని - వ‌చ్చిన వారంతా ప‌వ‌న్ కు ఓటెయ్య‌ర‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు ప్ర‌చారం చేస్తున్నారు. 2019ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ప్ర‌భావం పాక్షిక‌మేన‌ని...అధికారం చేప‌ట్ట‌లేర‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు ప‌డే ఓట్ల‌పై ప‌వ‌న్ స్పందించారు. త‌న ద‌గ్గరకు వచ్చిన వారంతా ఓట్లు వేస్తారని తాను అనుకోవ‌డం లేద‌ని ప‌వ‌న్ అన్నారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు న్యాయం చేసేందుకు - విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకు జనసేన పెట్టాన‌ని ప‌వ‌న్ అన్నారు.

2019 ఎన్నికల్లో మార్పు తీసుకువ‌స్తాన‌ని - అందుకే మధ్య తరగతివారికి అనుకూలంగా జ‌న‌సేన మ్యానిఫెస్టో రూపొందించాన‌ని ప‌వ‌న్ అన్నారు. కష్టపడి బ్ర‌త‌కాల‌నే ప్ర‌తి ఒక్కరు సుఖసంతోషాలతో బ్ర‌తకాలని కోరుకునే వ్య‌క్తిన‌ని అన్నారు. రాష్ట్రంలోని సమస్యల‌ను జ‌న‌సేన మ‌రింత జ‌టిలం చేయ‌ద‌ని - వాటి పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు. డీజిల్ - పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతోన్న ప్ర‌శ్నించే వారే క‌రువ‌య్యారన్నారు. గ‌ర్భిణుల‌కు ఉచితం అని ఆటోపై పోస్ట‌ర్ చూసిన‌పుడు...ఆటో డ్రైవ‌ర్ల సంక్షేమం కోసం ఏమ‌న్నా చేయాల‌నిపిస్తుంద‌ని అన్నారు. ఆటో డ్రైవర్లకు జనసేన అండగా ఉంటుందన్నారు. ఆటో డ్రైవర్లపై డీజిల్ - పెట్రోల్ ధరలు భారం పడకుండా సబ్సిడీలు అందించేలా చర్యలు చేపడతామని త‌న‌ను క‌లిసిన ఆటో డ్రైవ‌ర్లకు ప‌వన్ హామీ ఇచ్చారు. పార్టీని నడ‌ప‌డం కష్టమేన‌ని - వేల‌కోట్లతో కాకుండా మేధాశక్తితో నడపాలని ప్రయత్నిస్తున్నానని అన్నారు.

అయితే, వేల‌కోట్ల‌తో పార్టీని న‌డ‌ప‌న‌ని....మేధా శ‌క్తితో న‌డుపుతాన‌ని స్టేట్ మెంట్లు ఇస్తోన్న ప‌వ‌న్....కొద్ది రోజుల క్రితం కాక‌తీయ హోట‌ల్ లో నిర్వ‌హించిన స‌మావేశం గురించి మ‌ర‌చిపోయినట్లున్నారు. ఇన్విటేష‌న్ లు ఇచ్చి మ‌రీ....తన సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖుల‌తో భేటీ అయిన ప‌వ‌న్....ఫండ్స్ వ‌సూలు చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఓ ప‌క్క కుల‌ర‌హిత స‌మాజ‌మంటూ ....మ‌రో ప‌క్క త‌మ సామాజిక వ‌ర్గం వారితో స‌మావేశం, నిధుల సేక‌ర‌ణ‌ ఏమిట‌ని ఓ చానెల్ తో క‌థ‌నం ప్ర‌సార‌మైన విష‌యం విదిత‌మే. మేధా శ‌క్తితో పార్టీని న‌డిపే ప‌వ‌న్ కు....ఫండ్స్ తో ఏం పనో ఆయ‌నే స‌మాధానం చెప్పాలి.