Begin typing your search above and press return to search.
పీకే ఇన్విటేషన్ కు బాబు ఏమంటారో?
By: Tupaki Desk | 28 Oct 2019 2:24 PM GMTఏపీలో రాజకీయం ఇప్పుడు ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. గడచిన ఎన్నికల్లో అధికార టీడీపీతో పాటు ఆ పార్టీకి తోక పార్టీగా పరిగణించిన జనసేనకు కూడా జనం గట్టి దెబ్బే కొట్టేశారు. ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ పొత్తు ఉందన్న లోగుట్టును గమనించిన నేపథ్యంలోనే జనం... ఆ రెండు పార్టీలకు కోలుకోలేని షాకిచ్చారన్న వాదనలూ లేకపోలేదు. అయితే ఎన్నికలు ముగిశాయి... వైసీపీ అధికార పగ్గాలు చేపట్టింది. మరో ఐదేళ్ల దాకా ఎన్నికలన్న మాటే లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్ సర్కారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని వాదిస్తున్న జనసేన... ఇసుక కొరతను నిరసిస్తూ ఏకంగా విశాఖలో వచ్చే నెల 3న ఏకంగా లాంగ్ మార్చ్ పేరిట భారీ నిరనస ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ఇంతదాకా బాగానే ఉన్నా... ఈ నిరసన ప్రదర్శనలో తమతో కలిసి రావాలంటూ జనసేనాని హోదాలో పవన్ కల్యాణ్... ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఆహ్వానం పలికారు. ట్విట్టర్ వేదికగా పవన్ పంపిన ఈ ఆహ్వానానికి చంద్రబాబు అండ్ కో ఎలా రియాక్ట్ అవుతుందన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసిందనే చెప్పాలి.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న దారుణ పరిస్థితులకు వైసీపీ ప్రభుత్వం ఒక్కటే కారణం కాదని, ఈ తరహా పరిస్థితులకు మొన్నటిదాకా అధికారంలో ఉండి ఇప్పుడు విపక్షంలో కూర్చున్న టీడీపీ కూడా కారణమేనని పవన్ సహా... జనసేన నేతలంతా భావిస్తున్నారు. ఈ కోణంలోనే వైసీపీతో పాటు టీడీపీపైనా జనసేన విరుచుకుపడిన విషయమూ మనకు తెలిసిందే. అసలు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై భారీ అవినీతి ఆరోపణలు చేస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయి కదా. ఈ వ్యాఖ్యల్లో పవన్... టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొనసాగించిన ఇసుక దందాను కూడా ప్రస్తావించారు. ఏనాడూ చంద్రబాబుపై నేరుగా విమర్శలు గుప్పించని పవన్... ఇసుక దందాను ఆదారం చేసుకునే అవినీతి ఆరోపణలు చేశారు. అయితే పవన్ ఎంతగా విరుచుకుపడ్డా... కొందరు టీడీపీ నేతలు మినహా... చంద్రబాబు గానీ - లోకేశ్ గానీ ఆ ఆరోపణలపై అంతగా స్పందించని వైనం కూడా మనకు తెలిసిందే. అంటే పవన్ ఎంతగా తమపై విమర్శలు గుప్పించినా... ఆయనను చంద్రబాబు తమ వాడిగానే పరిగణించిన నేపథ్యంలోనే ప్రతి విమర్శలకు దిగలేదని నాడు గుసగుసలు వినిపించాయి.
ఇదంతా గతం అనుకుంటే... ఇప్పుడు తాను నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ లో తమకు తోడు రావాలని - తమ నిరసనకు మద్దతు తెలపాలని - ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై విపక్షాలన్నీ కూడా ఒక్కటిగా పోరాడాలని పవన్ చేసిన విన్నపానికి టీడీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా వినిపిస్తోంది. మరో ఐదు రోజుల్లో లాంగ్ మార్చ్ జగరనుండగా... పవన్ సోమవారం టీడీపీకి ఊహించని ఆహ్వానం పంపారు. లాంగ్ మార్చ్ లో తమతో కాలు కదపాలని - ఉద్యమంలో కదం తొక్కాలని కూడా పవన్ ఆహ్వానించారు. ఇప్పటికే విపక్షాలుగా ఉన్న బీజేపీ - వామపక్షాలకు కూడా తాను ఆహ్వానం పంపానని, ఈ నేపథ్యంలో మిమ్మిల్నీ రమ్మని కోరుతున్నానని పవన్ టీడీపీకి విన్నవించారు. లాంగ్ మార్చ్ లో తమతో కలిసి నడవాలని పవన్ పంపిన ఆహ్వానానికి చంద్రబాబు ఎలా స్పందిస్తారన్న విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. చూద్దాం... పవన్ ఇన్విటేషన్ ను చంద్రబాబు ఏ మేరకు మన్నిస్తారో?