Begin typing your search above and press return to search.

పవన్ ఆ పని కనుక చేస్తే పొలిటికల్ గా హీరోనే... ?

By:  Tupaki Desk   |   12 Aug 2021 2:30 PM GMT
పవన్ ఆ పని కనుక చేస్తే పొలిటికల్ గా హీరోనే... ?
X
పవన్ కళ్యాణ్ సినీ నటుడు కమ్ పొలిటీషియన్. పవన్ కళ్యాణ్ జనసేనానిగా ఉంటూనే సినిమాలు వరసపెట్టి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ మనసు అంతా సినిమాల మీదనే ఉంది మరి. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుకుగా ఉండాల్సిన సమయం ఇదేనని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.

ఏపీలో వైసీపీకి ఇపుడు కొంత వ్యతిరేకత ఉంది. రానున్న రోజులల్లో అది మరింత హెచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ప్రజలు కూడా అనేక సమస్యలతో సతమతమవుతున్నారని కూడా విశ్లేషణలు ఉన్నాయి. గతంలో పవన్ పాచిపోయిన లడ్డూలు అంటే కేంద్రం మీద ఒక్కసారిగా విరుచుకుపడితే ఆ సౌండ్ ఎంతలా ఢిల్లీలో రీసౌండ్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇపుడు అలాంటి పొలిటికల్ సౌండ్ చేయడానికి సరైన సమయం అని అంతా అంటున్నారు.

ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ఏపీ మొత్తానికి సంబంధించినది. ఇక రాజకీయంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశం. దాంతో పవన్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మీద గట్టిగా గర్జిస్తే హస్తినలోనే మొత్తం రాజకీయ లెక్కలు మారిపోతాయి.

అంతే కాదు ఏపీ రాజకీయాలలో కూడా భారీ తేడాలు వచ్చేస్తాయి. పవన్ సై అనాలే కానీ జనసైనికులు ఉవ్వెత్తున ఉద్యమంలో ఉరుకుతారు. ఇప్పటిదాకా స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న పోరాటం వేరు. పవన్ వస్తే కనుక దాని రూపురేఖలు పూర్తిగా మారిపోవడం తధ్యమనే అంటున్నారు.

పవన్ ఇలాంటి హాట్ టాపిక్ ని తీసుకుంటే ఏపీ జనాల గుండెల్లో నిలిచి పోవడమే కాకుండా ఆయన రాజకీయాలోకి వచ్చినందుకు పార్టీ పెట్టినందుకు కూడా సార్ధకత చేకూరుతుంది అంటున్నారు. పవన్ కి రాజకీయంగా లాభం చేసే వ్యవహారమే కానీ మరోటి కూడా ఇది కాదు అని చెబుతున్నారు.

ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం పెడుతున్న ఇబ్బందులు నిధులు ఇవ్వకుండా సృష్టిస్తున్న అవాంతరాల మీద కూడా పవన్ గొంతు ఎత్తితే ఆ ఇంపాక్ట్ గోదావరి జిల్లాల మీద ఉంటుంది అంటున్నారు. అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని కూడా ఒక్క దెబ్బకు అన్నట్లుగా పవన్ గట్టిగా తగులుకుంటే ఆయన చేతిలో కచ్చితంగా అయిదురు జిల్లాల జనం ఉంటారు అని చెబుతున్నారు.

ఇక ఏపీలో నిరుద్యోగ యువత జాబ్ క్యాలండర్ బాలేదని గోల పెడుతున్నారు. దాని మీద కనుక సరిగ్గా ఉద్యమిస్తే యువత పవన్ వెంట నడిచే అవకాశం ఉంటుంది. వచ్చే ఎన్నికలకు జనసేన గట్టి ఫోర్స్ గా మారేందుకు కూడా వీలుంటుంది. ఏపీలో ఇపుడున్న పరిస్థితుల్లో వైసీపీ వీక్ అయినా టీడీపీని జనాలు మళ్ళీ అందలం ఎక్కించేందుకు తటపటాయిస్తున్నారు.

కొత్త పార్టీగా జనసేన వస్తే కనుక ఆయనకు అవకాశం ఇవ్వడమూ ఖాయమే అన్న విశ్లేషణలు అయితే ఉన్నాయి. మరి పవన్ ఆ దిశగా ఆలోచన చేస్తారా. వెయిట్ అండ్ సీ.