Begin typing your search above and press return to search.
పవన్ పై మళ్లీ కత్తి దూశాడు
By: Tupaki Desk | 2 Jan 2018 1:25 PM GMTజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడటంలో ముందుండే సినీ క్రిటిక్ కత్తి మహేశ్ మరోమారు కలకలం రేకెత్తించే కామెంట్లు చేశారు. ఓ టీవీ చానల్ చర్చ సందర్భంగా పవన్ ఓ పవర్ బ్రోకర్..పొలిటికల్ జోకర్ అంటూ విరుచుకుపడ్డారు. దీనిపై అదే చర్చలో పాల్గొన్న జనసేన నేత తప్పుపట్టారు. అయినప్పటికీ...మరో కాలర్‌తో కత్తిమహేశ్ అవే కామెంట్లు చేశారు! తన వాదనకు మద్దతుగా ఆయన వివరణ కూడా ఇచ్చారు.
కత్తిమహేశ్ పాల్గొన్న ఓ చర్చకు ఫోన్ చేసిన మహిళా కాలర్..ఎందుకు పవన్‌ను శత్రువుగా భావిస్తున్నారు? పదే పదే విమర్శలు చేస్తున్నారు? అని ప్రశ్నించగా...`పవన్‌తో నాకేమీ ఆస్తి వివాదాలు లేవు. నా ప్రియురాలిని ఆయనేమీ ఎత్తుకుపోలేదు` అని వ్యాఖ్యానించారు. దీంతో వెంటనే స్పందించిన ఆ కాలర్ సభ్యతతో మాట్లాడాలని కోరారు. దీంతో మహేశ్ వెంటనే..`మంచిగానే స్పందించాను` అని అన్నారు.
దీంతో ఆ కాలర్ మళ్లీ స్పందిస్తూ....`మీరు పవన్‌ను పొలిటికల్ బ్రోకర్ అన్నారు. మరి మేం మిమ్మల్ని సినీ బ్రోకర్ అంటాం. మీ రివ్యూలన్నీ జోకులుగా తీసుకుంటాం మీకు ఓకేనా?` అని ప్రశ్నించారు. దానికి కత్తి మహేవ్ అంతే కూల్‌గా రిప్లై ఇచ్చారు. `మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. మీ అభిప్రాయంతో నేను విబేధించను. అలా అనుకున్నప్పుడు నా విశ్లేషణలు, కామెంట్లను మీరు ఫాలో అవాల్సిన అవసరం లేదు` అంటూ సమాధానమిచ్చారు.దీంతో ఆ కాలర్ మళ్లీ జోక్యం చేసుకొని `మీరు విమర్శించాలని అనుకుంటే....పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శించండి` అని అనడంతో...`ఎవరైతే వంగిపోయన వారు ఉంటారో వారు ఏనాడు అధికారంలోకి రాలేరు. పవన్‌పై నాకేమీ ద్వేషభావం లేదు. ఆయనంటే అభిమానం కూడా. అయితే ఆయన బానిసత్వపు ఆలోచనల తీరుపైనే కోపం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుకు మధ్య కుమ్మక్కు ఉంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ 25-35 సీట్లు జనసేనకు ఇవ్వబోతోంది. ఇందులో తప్పేం లేదు కూడా` అంటూ కత్తి మహేష్ ముగించారు.