Begin typing your search above and press return to search.

బండ్ల వెనుక పవన్ ఉన్నారా.....!?

By:  Tupaki Desk   |   14 Sep 2018 8:36 AM GMT
బండ్ల వెనుక పవన్ ఉన్నారా.....!?
X
ఆయన ఆ హీరోకి నమ్మిన బంటు.......ఆ హీరో కోసం సినిమాలు తీయడమే కాదు....ప్రాణాలు కూడా తీసుకుంటానని అంటారు... ఆ హీరో రాముడైతే తాను హనుమంతుడనంటారు. ఆ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పట్ల నిర్మత బండ్ల గణేష్‌ కు ఉన్న అభిమానం అది. పవన్ కల్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీ ఉండగా ఇప్పుడు నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్‌ లో చేరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలంగాణలో తనకు అభిమానులు ఉన్నారని - తన సిద్దాంతాల పట్ల నమ్మకం ఉన్నవారు కూడా ఉన్నారని పవన్ కల్యాణ్ చెబుతారు. తన బలాన్ని - తన బలగాన్ని అంచన వేసుకుని తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికలలో కూడా పోటి చేసే అవకాశం ఉందని పవన్ ఇటీవల ప్రకటించారు.

తెలంగాణలో జనసేన పోటి చేస్తే నిర్మాత బండ్ల గణేష్ తన సొంత నియోజక వర్గం నుంచి పోటి చేస్తారని అందరూ భావించారు. అయితే ఇందుకు విరుద్దంగా బండ్లత గణేష్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ చేరిక వెనుక పవన్ కల్యాణ్ ఉన్నారా అని అనుమానాలు వస్తున్నాయి. జనసేన పార్టీ తెలంగాణలో పోటి చేయకపోయిన ఆ పార్టీ కోసం బండ్ల గణేష్ శ్రమిస్తారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా బండ్ల గణేష్ కాంగ్రెస్ లో చేరారు. ఈ చేరిక గురించి పవన్ కల్యాణ్‌ కు ముందే తెలుసని - ఆయన ఆమోద ముద్రతోనే బండ్ల గణేష్ కాంగ్రెస్ చేరుతున్నారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్‌ కు - భారతీయ జనతా పార్టీతో ఇప్పటికీ అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీలో తన అన్న చిరంజీవి ఉన్న ఆయన అంత ఉత్సాహంగా లేరు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక నాయకుడు ఉండాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ఇక్కడ కూడా తనకు తన మనిషి ఉండాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని అందులో భాగంగానే కాంగ్రెస్‌ లోకి పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బండ్ల గణేష్‌ కు టిక్కెట్టు ఇస్తే - పవన్ గెలుపు బాధ్యతను తీసుకుంటానని కాంగ్రెస్ నాయకులకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. రాజకీయాలలో ఏమాత్రం అనుభవం లేని సినీ పరిశ్రమలో అంత పేరులేని బండ్ల గణేష్ జాతీయ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాందీ సమక్షంటో కాంగ్రెస్‌ లో చేరారంటే అది పవన్ పుణ్యమేనని చెబుతున్నారు.