Begin typing your search above and press return to search.

పవన్‌ కల్యాణ్‌ ఫాదర్‌ థెరీసా:అలీ

By:  Tupaki Desk   |   25 Feb 2019 8:37 AM GMT
పవన్‌ కల్యాణ్‌ ఫాదర్‌ థెరీసా:అలీ
X
పవన్‌ కల్యాణ్‌- అలీ ఇద్దరికి విడదీయరాని బంధం. అలీ నా గుండెకాయ అని పవన్ చాలాసార్లు చెప్పాడు. అలాగే అలీ కూడా పవన్‌ చాలా గొప్పవాడు, మంచివాడు అని చెప్తూనే ఉంటాడు. ఇప్పుడు ఏకంగా.. పవన్‌ కల్యాణ్‌ ని ఫాదర్‌ థెరీసా అంటూ ఆకాశానికి ఎత్తేశాడు అలీ. పవన్‌, అలీ మంచి ఫ్రెండ్స్‌ కానీ పవన్‌ ని అలీ ఈ రేంజ్‌ లో ఎప్పుడూ పొగిడింది లేదు. అయితే.. ఎన్నికల నేపథ్యంలోనే పవన్ అభిమానుల్ని మంచి చేసుకునేందుకే అలీ ఈ విధంగా పొగుడుతున్నాడని విమర్శించేవాళ్లు లేకపోలేదు.

ప్రస్తుతానికి పార్టీ ఏదో ఖరారు కాకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో అలీ పోటీ చేయడం మాత్రం కన్‌ ఫర్మ్‌. టీడీపీ నుంచే గుంటూరు తూర్పు నుంచి అలీ పోటీ చేయడం దాదాపుగా ఖరారు అయిపోయినట్లే. అయితే. టీడీపీ టిక్కెట్‌ ఇచ్చినంత మాత్రన అలీ గెలుపు నల్లేరు మీద నడక అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ బలంగానే ఉంది ఆల్‌ రెడీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నాడు. సో.. ముస్లిం ఓట్లు చీలినా మిగిలిన హిందువుల ఓట్లు మొత్తం అలీకే పడాలి. అలాంటప్పుడు అలీకి పవన్‌ కల్యాణ్‌ లాంటి వాడి మద్దతు కావాలి. గుంటూరు లాంటి ప్రాంతాల్లో పవన్‌ కు, పవన్‌ పార్టీకి మంచి పట్టుంది. జనసేనకు ఉన్న ఓట్లన్ని అలీకి పడితే.. మైనారిటీ ఓట్లు ఎలాగూ పడతాయి. దీంతో.. గెలుపు కన్‌ ఫర్మ్‌ అనే ప్లాన్‌ లో ఉన్నాడు అలీ. అందుకే.. పవన్‌ ని పొగుడుతున్నాడు అని వార్తలు వస్తున్నా.. అలీ, పవన్‌ కల్యాణ్‌ మధ్య ఉన్న సేహ్నాన్ని బట్టి చూస్తే.. అలీ అలాంటివాడు కాదని ఇట్టే చెప్పేయ్యచ్చు.