Begin typing your search above and press return to search.

బీజేపీని రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్?

By:  Tupaki Desk   |   21 Oct 2022 1:30 PM GMT
బీజేపీని రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్?
X
ఏపీలో బీజేపీతో సాన్నిహిత్యంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ .. తెలంగాణలో మాత్రం అదే బీజేపీ శత్రువులా కనిపిస్తోంది. తాజాగా బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన తన మిత్రుడు దాసోజ్ శ్రవణ్ అభినందిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రాజకీయ భవిష్యత్ కు మంచి అడుగులు వేశావంటూ పవన్ తన మిత్రుడిని పొగడడం ఇన్ డైరెక్టుగా బీజేపీ తప్పుడు పార్టీ అని చెప్పినట్టేనని పలువురు కౌంటర్లు ఇస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై పోరాడేందుకు బీజేపీ రోడ్‌మ్యాప్‌ ఇవ్వకపోవడంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల మోడీ-షాలకు ఫిర్యాదు చేయడానికి తానేం చిన్న పిల్లాడినా? అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీపై అసంతృప్తిని బయటపెట్టినట్టయ్యాయి.. అవసరమైతే టీడీపీతో చేతులు కలుపుతామని కూడా ఆయన హింట్ ఇచ్చారు.

తెలంగాణలో కీలకమైన మునుగోడు ఉపఎన్నిక జరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ బీజేపీకి చురకలంటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మునుగోడులో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇటీవల భాజపాలో చేరిన దాసోజు శ్రవణ్‌కుమార్‌ ఆపార్టీ విధానాలు నచ్చక టీఆర్‌ఎస్‌లో చేరారు.

శ్రావణ్ కుమార్ ప్రజారాజ్యం రోజుల్లో పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా పనిచేశాడు. ఏ పార్టీతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్‌కి చాలా సన్నిహితుడు. ఈరోజు శ్రవణ్ బీజేపీని వీడినప్పుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసించడం చర్చనీయాంశమైంది.

డైనమిక్ & విజన్ ఉన్న నాయకుడిగా ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఈ కోరిక తెలంగాణలోని బిజెపి మద్దతుదారులను దెబ్బతీసింది మరియు వారు ఉద్దేశపూర్వకంగా పవన్‌ అవమానించాడని.. బీజేపీపై కోపాన్ని ఇలా ప్రదర్శించాడని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. శ్రవణ్ రాజకీయ అడుగులు కరెక్ట్ గా వేశాడన్న పవన్ మాటలు బీజేపీలో ఉండడం తప్పు అని చెప్పినట్టే అర్థమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.