Begin typing your search above and press return to search.
జనసేన రూట్ క్లియర్ చేస్తున్న పవన్ !
By: Tupaki Desk | 11 March 2018 7:41 AM GMTఒక పార్టీకి నాలుగేళ్లు నిండటం అంటే గత చరిత్రను కచ్చితంగా తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పుట్టుకతోనే *రాష్ట్రం కోసం* అనే థీమ్‌తో బీజేపీ-టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్... తన తప్పు తెలుసుకుని కొత్త అడుగులు వేస్తున్నారు. మూడేళ్లు అపుడపుడు మాత్రమే కనిపిస్తూ చాలా కాలం సైలెంట్‌గా ఉన్న పవన్ గత ఆరు నెలల నుంచి బాగా యాక్టివ్ అయ్యారు. ఆయన ప్రతి మీటింగ్‌లోనూ టీడీపీ-బీజేపీ గురించి ప్రశ్నిస్తుంటే.. వాటిని వదిలేయలేక పవన్ కి తప్పలేదు. దీంతో ఆయన ప్రశ్నించడం మొదలుపెట్టాల్సి వచ్చింది. ఆ క్రమంలో పవన్ చేసిన కొన్ని కామెంట్లు అతనికి ప్రతికూలంగా కూడా మారి.. ఇక పవన్ కథ అంతేనా అని అనుమానాలు రేకెత్తుతున్న దశలో పవన్ వేసిన ఒక అడుగు అతనికి పాజిటివ్ గాలి వీచేలా చేసింది. ఆ అడుగే జేఎఫ్‌సీ.
ఏపీకి కేంద్రం చేసిన సాయం ఏంటి? కేంద్ర నిధుల విషయంలో ఏపీ అధికార పార్టీ చేసిన తప్పులేంటి? అని పరిశీలించిన ఈ కమిటీ ఇద్దరి తప్పు ఉందని తేల్చింది. కేంద్రం అన్యాయం చేసిన మాట నిజమని నిరూపించింది. ఈ ప్రయత్నాలు కొంతలో కొంత పవన్ పై నిందలను తగ్గించాయి. ఇక పార్టీ పరంగా చూస్తే ఈ పని పార్టీకి కొంత బజ్‌ను క్రియేట్ చేసింది. అయితే, ఇంతకాలం అటు సినిమాలు-ఇటు రాజకీయాలు అన్నట్టు నడిపిన పవన్ ఇపుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. మార్చి 14న మొదటి సారి పార్టీ ప్లీనరీ నిర్వహిస్తున్నాడు. రాష్ట్రంలో ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పోటీ చేసేలా పవన్ అడుగులు పడుతున్నాయి. భారీ జనంతో మెగా సభ జరపాలని చూస్తున్న పవన్ తన శక్తిని కూడా ఈ సందర్భంగా పరీక్షించదలచుకోనున్నాడు. పార్టీకి ఇది మొదటి ప్లీనరీ. ఈ సందర్భంగా పార్టీకి పలు కమిటీలను ప్రకటించే అవకాశం కూడా ఉంది.
ప్రమోషన్లో భిన్నం..
పవన్ సినిమాల నుంచి రావడంతో మిగతా పార్టీల కంటే ప్రమోషన్ కంటెంట్ విషయంలో జనసేనకు కొన్ని ప్లస్‌లు ఉన్నాయి. సభకు పార్టీయే రకరకాల ఫ్లెక్సీ డిజైన్లు పంపి ఇవి ప్రింటు చేసుకోండని కార్యకర్తల పనిని సులువు చేశారు. పూర్తిగా ఖద్దరులోకి వచ్చిన పవన్ ఇటీవలే ఫొటో షూట్ దిగి మార్చి 14 సభకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. పవన్ ప్రజలతో కలిసిన పలు సందర్భాలతో మంచి డిజైన్ రిలీజ్ చేయడంతో అది సోషల్ మీడియాలో బాగా రీచ్ అవుతోంది.