Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఒత్తిడి.. ఏం చేద్దాం?
By: Tupaki Desk | 25 Jun 2020 11:30 AM GMTఓవైపు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలోని ప్రజలపై సంక్షేమ జల్లు కురిపిస్తోంది. ఏమాత్రం తగ్గకుండా వరాలు ప్రకటిస్తూ ప్రజలకు పథకాలు చేరువ చేస్తూ పోతోంది. వాటి మీద కౌంటర్లు వేస్తూ ప్రతిపక్ష టీడీపీ కూడా రచ్చ చేస్తోంది. టీవీ చర్చలో ఎక్కడ చూసినా వైసీపీ, టీడీపీ మధ్య వార్ తీవ్రస్థాయికి చేరిపోయింది. కానీ ఇంత జరుగుతున్న ఏపీలోని మరో ప్రతిపక్షం జనసేన ఉలుకులేదు పలుకులేదు. పవన్ కళ్యాణ్ సుబ్బరంగా హైదరాబాద్ లో సేదతీరుతున్నారు. కనీసం ప్రకటనలు కూడా జారీ చేయడం లేదు. పార్ట్ టైం పాలిటిక్స్ కు అలవాటుపడ్డ పవన్ కళ్యాణ్ 15 రోజులకో.. నెలకోసారి అలా వచ్చి ఉద్రిక్తతలు పెంచి ఇలా మాయమైపోతారనే అపవాదును తెచ్చుకున్నారు.
2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేనకు దాదాపు 6 శాతం ఓట్లు వచ్చాయి. స్వయంగా పార్టీ ప్రెసిడెంట్ అయిన పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తరువాత ఆయనకు తత్త్వం బోధపడింది. ఎన్నికలకు ముందు వరకూ ఇక తాను సినిమాలు చేయనని రాజకీయాల్లోనే శాశ్వతంగా ఉంటానన్న పవన్ ప్లేట్ ఫిరాయించి సినిమాలు కూడా సైలెంట్ గా మొదలు పెట్టారు. ప్రశ్నించిన వారికి నాకు ఆర్థిక ఇబ్బందులున్నాయని.. అందుకే సినిమాలు చేయక తప్పని పరిస్థితి అని కవర్ చేశాడు.
పవన్ ప్లేట్ ఫిరాయించడంతో క్షేత్రస్థాయిలోని జనసేన క్యాడర్ మెల్లిగా వైసీపీలోకి జారుకుంటున్నారు. కొందరు నచ్చని వారు టీడీపీలోకి వెళ్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నయ్యలు వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల్లో జనసేనకు 10వేల ఓట్లు వచ్చినా సీట్లు దాదాపు 35 ఉన్నాయి. అవి టీడీపీ మీదకు ప్రభావితం అవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఉంటుందా? ఉండదా అని ఏమీ అర్థం కావడం లేదు అని కింద ఉన్న యువ నాయకులు సందిగ్ధంలో పడిపోతున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ ను కలిసి అసలు పార్టీని నడిపిస్తారా? లేదా అని ఖరాఖండీగా అడుగుదాం అని జనసేన సైనికులు డిసైడ్ అయ్యారని అంటున్నారు.
పరిస్థితి చూస్తుంటే.. ప్రజారాజ్యం బాటలోనే జనసేన కూడా జెండా పీకేసే పరిస్థితి ఉందని జనసైనికులు అనుమానపడుతున్నాయి. అన్నయ్యలాగే తమ్ముడు కూడా బీజేపీలోకి జనసేనను విలీనం చేసి ఆ పార్టీ పగ్గాలు చేపడుతారని.. కాడి వదిలేస్తాడని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రజారాజ్యంతో చిరంజీవి, జనసేనతో పవన్ కళ్యాణ్, నాగబాబులు పాలిటిక్స్ కు పనికిరారు అని జనసేన కింద స్థాయి నేతలు ఆందోళనగా ఉన్నారు. ఈ పార్టీని నమ్ముకొని ఉంటే వేస్ట్ అని ఇతర పార్టీల వైపు వారంతా చూస్తున్నారట..