Begin typing your search above and press return to search.
ఎంపీ సీట్ల కోసం పవన్ భలే ముందడుగు వేశారే
By: Tupaki Desk | 4 Nov 2017 2:12 PM GMTజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ విస్తరణలో మరింత వేగం పెంచారు. ఇప్పటికే పార్టీకి తగిన రీతిలో కార్యకర్తలను ఎంపిక చేసిన జనసేనాని ఈ క్రమంలో మరో ముందడుగు వేస్తూ...పార్టీకి సేవలం దించడానికి సమన్వయకర్తలను నియమించాలని జనసేన నిర్ణయించారు. ప్రస్తుత ఈ నియామకాలు పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలకు పరిమితమై ఉంటాయి. ఈ మేరకు జనసేన పత్రికా ప్రకటన విడుదల చేసింది.
జనసేన ఔత్సాహక శిబిరాలను ఏర్పాటు చేసినప్పుడు సుమారు అరవై అయిదు వేల మంది దరఖాస్తు చేశారు. ఈ డేటా అంత జనసేన ఐటీ విభాగంలో రికార్డు అయి ఉంది. వీరిలో సుమారు ఎనిమిది వేలమందితో తొలి జాబితా సిద్ధం అయింది. ఈ ఎనిమిది వేల మంది జనసేన ఔత్సాహిక శిబిరాలలో పాల్గొననున్నారు. వీరందరికి పార్టీ పరిపాలన కార్యాలయం నుంచి ఈ-మెయిల్స్, ఎస్.ఎం.ఎస్. లు వెళ్లాయి. పార్టీకి సమన్వయకర్తలుగా సేవలు అందించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో తొలుత నిర్ధారించుకున్నాక పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సమావేశాలు ఈ నెల ఆరో తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. తొలి విడత లో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. డిసెంబర్ ఏడో తేదీ నాటికి ఈ సమావేశాలు ముగిసే విధంగా పార్టీ ప్రణాళికను సిద్ధం చేసింది. అవసరమైతే మరో రెండు మూడు రోజులపాటు గడువును పొడిగించే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాలలో ఉన్న 42 పార్లమెంట్ స్థానాలకు గాను 20 మంది చొప్పున అంటే 840 మందిని ఈ ప్రక్రియలో ఎంపిక చేస్తారు. అవసరం అనుకుంటే ఈ సంఖ్యను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పెంచే అవకాశం ఉంది. ఈ ఎంపిక సమావేశాలను నిర్వహించడానికి పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్, పార్టీ మీడియా హెడ్ హరి ప్రసాద్, సేవాదళ్ కోఆర్డినేటర్ రియాజ్,పార్టీ ప్రతినిధి నగేష్ తదితరులు జిల్లాలకు బయలుదేరి వెళుతున్నారు.వీరికి స్థానికంగా ఉన్న జనసేన కార్యకర్తలు సహాయసహకారాలు అందిస్తారు.
ఎంపికైన సమన్వయకర్తలకు హైదరాబాద్ లో సమగ్రమైన శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.శిక్షణ శిబిరానికి ముందు పవన్ కళ్యాణ్ గారు వీరందరితో సమావేశమవుతారు. పార్టీ స్థానిక నియామకాల్లో ఇది తొలి అడుగుగా భావించవచ్చు. పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించడానికి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరిన్ని నియామకాలను చేపట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. సమన్వయ కర్తలకు శిక్షణ ఇచ్చిన తరువాత స్పీకర్లు - అనలిస్టులు - కంటెంట్ రైటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.ఇవన్నీ త్వరలోనే కార్య రూపం ధరించడానికి పార్టీ ముఖ్య ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. స్థూలంగా పార్టీ కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు ఈ రకమైన కార్యాచరణలతో ముందుకు సాగుతున్నారు.