Begin typing your search above and press return to search.
అక్కడ పూజలు.. ఇక్కడ ప్రచారాలు.. పవన్ చెపుతోందేంటి..!
By: Tupaki Desk | 18 Jan 2023 11:30 AM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే వారాహి వాహనాన్ని రంగంలోకి దింపి.. రోడ్డెక్కించనున్నారనే విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారవుతోంది. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. వారాహి వాహనం లక్ష్యం ఏపీలో రాజకీయాలు చేయడం. ఏపీలో వైసీపీ నేతలను తరిమి తరిమి కొట్టడం. ఈ విషయాన్ని పవనే స్వయంగా చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చకుండా చూస్తానని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన వారాహి యాత్ర ద్వారా ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. వారాహి వాహనం విషయానికివస్తే.. అన్నీ పొరుగు రాష్ట్రంలోనే చేయిస్తున్నారు. అంటే.. ఇప్పటికే 20 లక్షలు ఫీజు కట్టి.. హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ చేయించారు.
అంటే.. వాస్తవానికి ఏపీకి రావాల్సిన సొమ్ము అక్కడకు పోయింది. దీనిపైనా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఏపీలో అయితే.. ఏదో ఒక రకంగా కొర్రీలు వేసి.. ఆ వాహనానికి అనుమతించరనేది ఒక కారణం.
రెండు అసలు.. వాహనం రిజిస్ట్రేషన్‌ను కూడా ఆపేసే అవకాశం ఉంది. ఈ రెండు కారణాలతో పవన్ హైదరాబాద్‌లోనే ఈ వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించారు.
ఇక, వారాహి వాహనం రెడీ అయినప్పటికీ.. పవన్.. అక్కడే పూజలు చేయిస్తున్నారు. కొండ గట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఈ వాహనానికి పూజలు చేయించి.. ప్రత్యేక విమానంలో ఈ వాహనాన్ని విజయవాడకు తీసుకు వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
అంటే.. మొత్తంగా వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్, పూజలు కూడా.. తెలంగాణలోనే పూర్తి చేసి.. ఏపీలో రాజకీయం చేయనున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. గతంలో వైసీపీ నేతలు.. హైదరాబాద్‌లో ఉండి.. ఏపీలో పాదయాత్ర చేయలేదా? ఇక్కడ రాజకీయాల్లో చక్రం తిప్పలేదా? అనేది ప్రశ్న.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.