Begin typing your search above and press return to search.

పవన్ - నాగబాబు..ఏంటి పరిస్థితి.?

By:  Tupaki Desk   |   23 May 2019 5:29 AM GMT
పవన్ - నాగబాబు..ఏంటి పరిస్థితి.?
X
ఏపీలో జనసేన ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడం రాజకీయ విశ్లేషకులను - ప్రజలను కూడా సంభ్రమాశ్చార్యాలకు గురిచేస్తోంది. ఏపీ వ్యాప్తంగా ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ప్రతిపక్ష వైసీపీకి పట్టం కట్టారు. టీడీపీ పాలనకు చరమగీతం పాడారు..

ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. పవన్ పోటీచేసిన భీమవరం - గాజువాకలో పవన్ వెనుకబడడం పరిస్థితికి అద్దం పడుతోంది. భీమవరంలో పవన్ మూడో స్థానంలో ఉండడం విశేషం. గాజువాకలో మాత్రం పోరాడుతున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ స్థానంలో వైసీపీ ముందంజలో ఉంది. ఇక్కడ పోటీచేసిన జనసేన పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు పోటీ ఇవ్వడం లేదు. మొదటి రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణ రాజు 2800ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఇలా ఏపీ ఎన్నికల్లో జనసేన ఫ్యాక్టర్ ఏమాత్రం కనిపించడం లేదు. స్వయంగా జనసేనాని పవన్ ఓడిపోయే పరిస్థితులు ఎదుర్కోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇక జనసేన ఓట్ల చీలిక కూడా టీడీపీ నుంచే జరగడం విశేషం.