Begin typing your search above and press return to search.
పవర్ స్టార్ కంటికి ఆనడంలేదా... ఏమనుకుంటున్నారు...?
By: Tupaki Desk | 27 Aug 2022 9:30 AM GMTఆయన పవర్ స్టార్. వెండి తెర మీద ఆయన కనిపిస్తే చాలు హాలు మొత్తం దద్దరిల్లిపోతుంది. ఆయన ఒక డైలాగ్ చెబితే చాలు పూనకాలు వస్తాయి. ఆయన బాడీ లాంగ్వేజ్ యూత్ కి అతి పెద్ద ఇన్ స్పిరేషన్. ఆయన మెడ మీద చేయి పెట్టి అలా నిమురుకుంటూ ఉంటే దానికి ఫిదా కాని వారు ఉంటారా. దటీజ్ పవన్ కళ్యాణ్. ఆయన చెప్పిందే డైలాగ్, వేసిందే స్టెప్, ఆయన తీసిందే సినిమా చేసిందే యాక్షన్. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. అంతలా పవన్ని తమ సొంతం చేసుకున్న వీరాభిమానులు తెలుగు నేల మీద నలు చెరగులా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ తమ లైఫ్ రిథమ్స్ అని భావించే యూత్ కి ఆయన బిగ్ ఐకాన్ గా ఉంటారు. పవన్ ఫ్యాన్స్ ఆయన హీరో మాత్రమే కాదు దేవుడు. మరి పవన్ కి టాలీవుడ్ లో అంతటి ఆదరణ ఉంటే ఆయన కమలం పార్టీ పెద్దల కళ్లకు ఎందుకు కనిపించడంలేదు. ఇది పవన్ ఫ్యాన్స్ ని వేధిస్తున్న ప్రశ్న అంటే అర్ధం ఉందిగా. ఈ మధ్యనే అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఆయన జూనియర్ ఎన్టీయార్ ని పిలిపించుకుని ముప్పావు గంటసేపు ముచ్చటించారు. డిన్నర్ కూడా కలసి చేశారు.
ఇపుడు ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు. ఆయన మరో టాలీవుడ్ హీరో నితిన్ ని కలుస్తున్నారు. ఇలా టాలీవుడ్ హీరోలను వరసబెట్టి బీజేపీ నేతలు కలవడం భేటీలు వేయడం బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ వారికి ఆనడంలేదా అన్నదే చర్చగా ఉంది. పవన్ కేవలం సినిమా నటుడు మాత్రమే కాదు, ఆయన జనసేన అనే పార్టీకి ప్రెసిడెంట్. పోనీ ఆ జనసేన ఏమన్నా బీజేపీకి యాంటీగా ఉందా అంటేలేనేలేదు.
ఇప్పటికి రెండున్నర ఏళ్ల క్రితమే బీజేపీతో దోస్తీ కట్టి అసలైన మిత్రపక్షంగా ఉంది. జనసేన బీజేపీ దోస్తీ ఉందని అపుడపుడు గుర్తు వచ్చినపుడు అటూ ఇటూ కూడా బీజేపీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది తమ మిత్రుడు ప్రముఖ నటుడు. ఇంకా వరసబెట్టి సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గుర్తుకు రాకపోవడం ఏంటి అన్నదే అందరి మదిని దొలిచేస్తున్న ప్రశ్నగా ఉంది.
నిజానికి పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్. ఆయనతో బీజేపీ ఉంటే మిగిలిన వారి అవసరమే ఉండదు కదా అని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ సామాజికవర్గం బలం ఉంది. అలాగే ఆయన ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఉంది. మరి చంకలో బిడ్డను ఉంచుకుని ఊరంతా తిరగడం ఎందుకు అన్నదే ఇక్కడ ప్రశ్న. అయితే బీజేపీ వారి ఆలోచనలు ఎవరికీ ఒక పట్టాన అర్ధం కావు. పైగా వారి రాజకీయం వేరుగా ఉంటుంది.
పవన్ వైఖరి చూస్తే ఏపీలో జగన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే తెలంగాణాలో టీయారెస్ విషయంలో పాజిటివ్ గా ఉంటున్నారు. ఈ రెండూ బీజేపీ పెద్దలకు అంతగా మింగుడు పడని విషయాలే అంటున్నారు. ఏపీలో చంద్రబాబు తో జట్టు కట్టాలని పవన్ ఆలోచన. అలాగే కేసీయార్ తో ఆయన మంచిగా ఉంటున్నారు. మరి చంద్రబాబుని కాదని ఏపీలో తనకంటూ ఒక సొంత బేస్ ఏర్పాటు చేసుకోవాలని, దానికి పవన్ అండగా ఉంటారని చేతులు కలిపిన బీజేపీకి పవన్ బాబు వైపు ఉండడం ఇబ్బంది అనే అంటున్నారుట.
ఇక కేసీయార్ ని గద్దె దించేందుకు బీజేపీ చూస్తోంది. ఆయనతో వీర లెవెల్ లో పోరాడుతోంది. కానీ పవన్ అనేక సందర్భాల్లో కేసీయార్ పాలనను మెచ్చుకున్నారు. దాంతోనే బీజేపీ ఆయనని పక్కన పెట్టిందా అన్న చర్చ వస్తోంది. అంతే కాదు ఆయన పొత్తుల పేరిట ఏపీలో పెద్దన్న పాత్ర కోరుకుంటున్నారు. కానీ ఒక జాతీయ పార్టీగా బీజేపీయే ఎపుడూ పై చేయిగా ఉండాలని చూస్తుంది. దాంతో ఇది కూడా ఇబ్బందిగా ఉంది అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కి ఝలక్ ఇవ్వడానికే సినీ హీరోలను వరసబెట్టి బీజేపీ పెద్దలు కలుస్తున్నారు అని అంటున్నారు.
మరి ఇంతకీ పవన్ బీజేపీ దోస్తీ ఉంటుందా. ఇప్పటికీ ఇద్దరూ మిత్రులేనా అంటే దీనికి జవాబు అంత సులువుగా దొరకదు. బీజేపీకి తగ్గి జనసేన ఉంటే సాధ్యపడుతుంది. అలాగే పవన్ తాను చెప్పినట్లుగా బీజేపీ రోడ్ మ్యాప్ ని మార్చుకుంటే కుదురుతుంది అన్న మాట వస్తోంది. సో పవన్ తో బీజేపీ మీటింగ్స్ ఇప్పట్లో ఉంటాయా అంటే ఏమో. కమలనాధులనే ఆ విషయం అడగాలి. అన్నింటికీ మించి పవన్ కూడా బీజేపీ నేతలతో భేటీలకు ఇష్టపడడం లేదు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందోల్.