Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ స‌భ‌కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు..ప‌వ‌న్ సార‌థ్యంలో మ‌రో క‌మిటీ

By:  Tupaki Desk   |   16 Feb 2018 5:30 PM GMT
కాంగ్రెస్ స‌భ‌కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు..ప‌వ‌న్ సార‌థ్యంలో మ‌రో క‌మిటీ
X
జ‌న‌సేన అధినేత - సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జేఎఫ్‌ సీ మొద‌టి స‌మావేశం తొల‌భేటీ ముగిసింది. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన అధినేత‌తో పాటుగా ఆ స‌మావేశంలో పాల్గొన్న నాయ‌కులు ప్ర‌సంగించారు. కాంగ్రెస్ నేత జంగా గౌతమ్ మాట్లాడుతూ త‌మ గుంటూరు సభకు పవన్ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. చట్టంలో ఉన్నవి అమలు చేయాల్సిందేన‌ని రాజీ పడేది లేదని తెలిపారు. 4 ఏళ్లుగా అమలు కాకపోవడానికి రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వాలదే బాధ్యత అని వ్యాఖ్యానించారు. త‌మ మీద అధికార పార్టీ పాపపు పార్టీ అని అనడం బాగాలేదన్నారు. రాష్ట్ర విభజనకు టీడీపీ కూడా లేఖ ఇచ్చింద‌ని అలా అయితే మీది తప్పేన‌ని వ్యాఖ్యానించారు.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఇది థాంక్ లెస్ జాబ్ అని అన్నారు. `ఇది సమస్య కొత్తది.. దేశంలో ప్ర‌థ‌మం. చట్టం అమలు కోసమే పోరాటం చెయ్యడం దారుణం. ఈ సబ్జెక్టు కొత్తది ఎవరికి అవగాహన లేదు.` అని అన్నారు. సీపీఎం నేత‌ మధు మాట్లాడుతూ ఆంధ్ర ప్రజలు శిక్షించబడుతున్న తీరును ఖండించామన్నారు. `మార్చ్ 5లోపు పార్లమెంట్ లో సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్రంలో తీవ్రమైన అగ్రహావేశాలు - ఆవేదన ఉంది. హోదా కన్నా ప్యాకేజీ గొప్పదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది` అని గుర్తు చేశారు.

జేపీ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆంధ్రలో - కొంత తెలంగాణలో కూడా బాధ ఉంద‌న్నారు. సమాఖ్య స్ఫూర్తిగా - దేశ ఐక్యత దెబ్బ తినకుండా.. తాటాకు మంటలాగా పోరాటం ఉండాలన్నారు. `విభజన చట్టం లో ఎన్ని అమలైనాయి - ఎక్కడ లోపాలు ఉన్నాయి..చూడాలి. హామీలు - విశ్వాసం లోక్‌ స‌భలో ఇచ్చిన వాగ్దానం ఆధారంగా చర్చలు జ‌ర‌గాలి. ఇచ్చిన డబ్బు ఏమైందని అడగడటం అనే భాషనే తప్పు కమిటీ తప్పు పడుతోంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రజల పన్నులను రాష్ట్రాల కు పంపిణీ కేంద్రం చేస్తుంది. మాములుగా వచ్చే ప్రాజెక్టులు చెప్పడం సరైంది కాదు. రాష్ట్రం తన నివేదికను జనసేన ఆఫీసుకు పంపిస్తా అని హామీ ఇచ్చింది. కేంద్రం నుండి అడిగితే పార్టీ ప్రతినిధులు ఇచ్చారు. ఇది స‌రికాదు ప్రభుత్వమే ఇవ్వాలి` అని జేపీ అన్నారు. `పద్మనాభయ్య - ఐవైఆర్ - చంద్రశేఖర్ తో కలిసి సంఘం ఏర్పాటు చేసి వారు సమాచారం అందిస్తారు. గుర్తింపు పొందిన పార్టీలు ఒకే గొంతుతో స్పందించేలా ప్రయత్నం. కీలక - ప్రత్యామ్నాయాలను గుర్తించి రేపు చర్చిస్తాము. `రెవెన్యూ లోటు - వెంకపడ్డ ప్రాంతాలు - పోలవరం - పన్నుల రాయితీలు - సంస్తల ఏర్పాటు - మౌలిక సదుపాయాలు - రైల్వే జోన్ - ప్రత్యేక ప్రతిపత్తి లేదా హోదా - రాజధాని నిర్మాణం రోజులు - వారాల్లో ఈ పని పూర్తవ్వాలని ఉంది. ఏపీ - తెలంగాణ ప్రజల మధ్య సుహృదబావ వాతావరణం ఉంది..ఇది కొనసాగాలి. రెండు రాష్ట్రాల కు ఇచ్చిన హామీల గురించి ఈ కమిటీ చర్చిస్తుంది` అని వివ‌రించారు. `మా దగ్గర నుండి అద్భుతాలు ఆశించకండి..ఆవేశం అనర్ధాలకు దారి తీస్తుంది` అని అన్నారు.

సీపీఐ నేత‌ రామకృష్ణ మాట్లాడుతూ `ఈ చర్చలు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతాయి. కేంద్రం ఏపీ మీద వ్యతిరేక వైఖరి అవలంబిస్తోంది. బడ్జెట్ లో కూడా అన్యాయం చేశారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల నుండి సమాచారం తెచ్చి ప్రజలకు ఇస్తాము. ఈ రాష్ట్రానికి ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చే వరకు పోరాటం ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ `ప్రజల్లో అసంతృప్తి నుండి జనసేన పుట్టింది. పాలకుల తప్పుకు ప్రజలు శిక్షించబడుతున్నారు. అయోమయ రీతిలో ప్రజలు - పార్టీలు ఉన్నాయి. అధికార - ప్రతిపక్షాలు - కేంద్రం ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. రేపు సబ్ కమిటీ మీటింగ్స్ ఉంటాయని తెలిపారు`