Begin typing your search above and press return to search.
టీడీపీకి మద్దతు ఇవ్వకుంటే జగనే సీఎం
By: Tupaki Desk | 3 Oct 2018 7:43 AM GMTతప్పు చేశా.. నేను.. తప్పు చేశానంటూ అదే పనిగా చెంపలు వేసుకుంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తాను చేసిన తప్పు గురించి ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవంతో ఉన్నోడు అనుకొని తాను చంద్రబాబుకు గడిచిన ఎన్నికల్లో మద్దతు ఇచ్చానని.. కానీ.. అదే పెద్ద తప్పుగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో తానుకానీ టీడీపీకి మద్దతు ఇవ్వకుండా ఉన్నట్లైయితే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారని పవన్ కల్యాణ్ తాజాగా వ్యాఖ్యానించారు.
తాజాగా జంగారెడ్డి గూడెంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన.. వేల కోట్ల రూపాయిలు దోచుకుంటున్న టీడీపీ నేతలు.. చంద్రబాబుకు డబ్బే ప్రధానంగా మారిందన్నారు. డబ్బే ప్రధానం అనుకుంటే అంబానీ ప్రధాని అయ్యేవారన్న ఆయన.. సీఎం కొడుకు లోకేశ్ వ్యాఖ్యల్ని తప్పు పట్టారు.
రాష్ట్రంలో 14వేల కిలోమీటర్లు రోడ్లు వేసినట్లుగా చెబుతున్నారని.. అయితే.. జంగారెడ్డి గూడెం నుంచి ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి టెంపులకు ట్రాఫిక్ లేనప్పుడే 40నిమిషాల సమయం పట్టిందని.. 14 కిలోమీటర్ల దూరానికి ఇంత టైం పడుతుందా? అని ప్రశ్నించారు. రోడ్డు బాగుంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. రాష్ట్రంలో రోడ్లు ఎంత బాగున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు.
సేంద్రీయ వ్యవసాయానికి అమెరికాకు వెళ్లి వేలాది కోట్లు అప్పులు తెస్తున్న బాబును ఉద్దేశించి పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు చేస్తున్న అప్పుల్ని మీ అబ్బాయి తీరుస్తారా? అంటూ ప్రశ్నించారు. అమరావతిలో రైతులకు బాండ్లు ఇచ్చినట్లే.. పోలవరం రైతులకు బాండ్లు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న కిలో రూపాయి బియ్యం తినటానికి పనికి రావని.. సారా కాయటానికి.. మొలాసిస్ తయారుచేసేందుకు ఉపయోగపడతాయన్నారు. బాబు తీరును తీవ్రంగా తప్పు పడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.