Begin typing your search above and press return to search.
ప్రతిపక్షాలన్నీ కలవటం సాధ్యమేనా ?
By: Tupaki Desk | 15 March 2022 5:01 AM GMTఅధికార పార్టీని దింపటానికి ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ ప్రకటనలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా అన్నీ పార్టీలతోను పొత్తులు పెట్టుకోవటానికి రెడీగా ఉన్నట్లు పవన్ చెప్పారు. ఇక్కడే పవన్ ప్రకటనపై భిన్నమైన స్పందనలు వినబడుతున్నాయి. ప్రస్తుతానికి జనసేన+బీజేపీ మిత్రపక్షాలన్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళతో జతకట్టడానికి చంద్రబాబునాయుడు ఆసక్తిగా ఉన్నారు.
నిజానికి చంద్రబాబుతో కలవటం వరకు పవన్ ఇష్టమే. అయితే తమతో టీడీపీని కలుపుకోవాలంటే అందుకు బీజేపీ అంగీకరించాల్సిందే. చంద్రబాబుతో ఎట్టి పరిస్థితుల్లోను కలిసేందుకు లేదని బీజేపీ లోకల్ నేతలు గట్టిగా చెబుతున్నారు. మరీ విషయం ఏమవుతుందో చూడాలి. అలాగే కాంగ్రెస్, వామపక్షాలను కలుపుకుని వెళ్ళటమన్నది పవన్ చేతిలో లేదు. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్, వామపక్షాలు బద్ధ వ్యతిరేకమన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పార్టీలు కలిసే అవకాశమే లేదని అందరికీ తెలుసు.
చంద్రబాబుతో కలవటానికి పవన్ ఎంత ఆసక్తి చూపుతున్నారో బీజేపీ అంత వ్యతిరేకిస్తోంది. చంద్రబాబును కలుపుకోవటానికి బీజేపీ స్థానిక నేతలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపటం లేదని అందరికీ అర్ధమవుతోంది. ఇలాంటి పరిస్ధితిల్లో చంద్రబాబును బీజేపీని కలపటం పవన్ కు దాదాపు అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్, వామపక్షాలను కూడా కలుపుకోవటం జరిగే పని కాదు. ఇక్కడే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఆపటం పవన్ వల్ల కాదని తేలిపోతోంది.
నిజానికి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలకున్న ఓటు బ్యాంకు దాదాపు నిల్లనే చెప్పాలి. అలాగే బీజేపీకి పడిన ఓట్లకన్నా నోటాకు పడిన ఓట్లే ఎక్కువ. కొద్దిలో కొద్దిగా జనసేనకు మాత్రమే 5 శాతం ఓట్లు పడ్డాయి. అంటే ఏ పద్దతిలో చూసినా టీడీపీ ఓటుబ్యాంకే ఎక్కువ. కాబట్టి రేపు అన్నీ పార్టీలు పొత్తులు పెట్టుకున్నా లేకపోతే తమతో చంద్రబాబును కలుపుకున్నా టీడీపీ నుండే మిగిలిన పార్టీలకు ఓట్లు బదలాయింపు కావాలి.
మొత్తానికి తన చేతిలో లేని పనిని పవన్ భుజానికెత్తుకోవటమే విచిత్రంగా ఉంది. మరి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా పవన్ ప్రయత్నాలు ఎంతవరకు సానుకూలమవుతాయో చూడాల్సిందే.
మరి బీజేపీ ఒప్పుకోకపోతే పవన్ బీజేపీ నుంచి బయటకు వస్తారేమో అన్న విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే బీజేపీ ఏపీకి చేసిందేమీ లేదు. పైగా వైజాగ్ స్టీల్ కూడా లాక్కుంటోంది. ఈ నేపథ్యంలో పవన్ వల్ల బీజేపీకి లాభమే గాని బీజేపీ వల్ల పవన్ కు నష్టమే. కాబట్టి బీజేపీ పవన్ మాట వినాల్సిన అగత్యం కూడా ఏర్పడవచ్చు.