Begin typing your search above and press return to search.
శతఘ్ని ఫైరింగ్ ఎప్పుడు నుంచి పవన్?
By: Tupaki Desk | 21 Feb 2018 7:47 AM GMTరాజకీయ పార్టీ ఏర్పాటు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. గతంలో మీడియా ఒక్కటే. ఇప్పుడు దానికి మించిన సోషల్ మీడియా అన్నది ఒకటి వచ్చింది. మీడియా ప్రభావం చేయటం కంటే సోషల్ మీడియా ప్రభావం జనాల మీద అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. ఏ పార్టీకి ఆ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన టీంను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
ధర్గ్ పార్టీ మాదిరి వ్యవహరించే సంప్రదాయ మీడియాకు భిన్నంగా ఉంటుంది సోషల్ మీడియా వ్యవహారం. ఇక్కడ ఎవరి డప్పు వారు కొట్టుకోవటం కంటే.. ప్రత్యర్థుల గురించి ఎంత ప్రచారం చేస్తే అంతగా సక్సెస్ అయ్యే పరిస్థితి. ఈ రోజు ఢిల్లీ ఏలుతున్న కేజ్రీవాల్ మొదలు.. దేశాన్ని ఏలుతున్న మోడీ వరకూ అందరూ సోషల్ మీడియా ప్రసాదాలే. సోషల్ మీడియా ప్రభావాన్ని గుర్తించిన మిగిలిన పార్టీలు ఇప్పుడు ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
పార్టీ సోషల్ మీడియా విభాగాల పనేమిటంటే.. తమను తాము గొప్పగా చెప్పుకోవటంతో పాటు.. ప్రత్యర్థులపై విష ప్రచారం చేయటం కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ బరిలో దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దిగితే.. కడప గూండాలు వైజాగ్ కు వచ్చేసారంటూ సాగిన ప్రచారం చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఇలాంటివెన్నో ఉదాహరణల్ని చెప్పొచ్చు.
మిగిలిన పార్టీల మాదిరే జనసేన కూడా తన సోషల్ మీడియా టీంను ఏర్పాటు చేసుకుంది. దానికి శతుఘ్ని అన్న పవర్ ఫుల్ పేరును డిసైడ్ చేశారు. సినిమా టైటిట్ మాదిరి కనిపించే ఈ పేరు పెట్టటం వెనుక పవన్ కు అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ ఉన్నట్లుగా చెబుతారు. సినిమా పేరుకు ట్యాగ్ లైన్ ఉన్నట్లే ఈ శతఘ్నికి ది డిజిటల్ రెజిమెంట్ ఆఫ్ జనసేన పార్టీ అంటూ పెట్టేశారు.
దీని పేరు ప్రకటించిన వెంటనే పవన్ అభిమానులు పలువురు చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఇటీవల కాలంలో తమ అభిమాన నటుడు.. కమ్ నేతపై ఆన్ లైన్ లో అదే పనిగా ట్రోలింగ్ అవుతున్నారని.. దీనికి ధీటుగా శతుఘ్ని పని చేయటం లేదన్న విమర్శ ఉంది. పవర్ ఫుల్ పేరు ఉన్నప్పటికీ.. అందుకు తగినంత ఫవర్ ను సోషల్ మీడియాలో ప్రదర్శించటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి చెందిన ఐటీ కంపెనీ శతఘ్ని నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. శతుఘ్ని మీద చాలా ఆశలు పెట్టుకున్న పవన్ కు సాయంగా నిలవటం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.