Begin typing your search above and press return to search.
పవన్ అధిక్యం 84 ఓట్లా?
By: Tupaki Desk | 23 May 2019 6:04 AM GMTఏపీ ఎన్నికల్లో భారీ ప్రభావాన్ని చూపిస్తారని.. గెలుపు గుర్రాల్ని డిసైడ్ చేయటంలో పవన్ కీలకంగా మారతారన్న అంచనాలకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. కలలో కూడా ఊహించని మెజార్టీతో జగన్ పార్టీ జైత్రయాత్ర సాగుతోంది. ప్రస్తుతం ఆయన పార్టీ 152 స్థానాల్లో అధిక్యతలో నిలిచింది. ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ పవన్ వెనుకంజలో ఉండటం షాకింగ్ గా మారింది.
ఆయన పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో విశాఖ జిల్లా గాజువాకలో తప్పనిసరిగా గెలుస్తారన్న నమ్మకం సర్వత్రా వ్యక్తమైంది. అయితే.. అందుకు భిన్నంగా ఓట్లు వస్తున్నాయి. మూడో రౌండ్ పూర్తి అయ్యేసరికి గాజువాకలో పవన్ కు కేవలం 84 ఓట్ల అధిక్యంలో మాత్రమే ఉన్నారు.
గాజువాకతో పాటు భీమవరంలోనూ పవన్ పోటీ చేస్తున్నారు. మొదట్నించి భీమవరంలో పవన్ గెలుపు మీద అనుమానాలు ఉన్నాయి. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మీద సానుకూలత ఉండటం.. గాజువాకలో పవన్ గెలిచే అవకాశం ఉందన్న ఆలోచనతో జనసేనానికి ఓట్లు పడలేదని చెబుతారు. ఈ అంచనాకు తగ్గట్లే ఇప్పుడు వెలువడుతున్న ఫలితం ఉండటం గమనార్హం.
తాజాగా ఆయన అధిక్యతలో వెనుకబడిపోయినట్లుగా చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు సరళిని చూస్తే.. పోటీ తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. గాజువాకలోనూ పవన్ గెలుపు మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఫలితాన్ని పవన్ ఊహించి ఉండరని చెప్పక తప్పదు. మిగిలిన రౌండ్లలో అధిక్యత కనపర్చి.. తుది ఫలితం ఏమైనా మారుతుందేమో చూడాలి. అయితే.. ఇప్పుడు నడస్తున్న ట్రెండ్ చూస్తే.. అలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు తక్కువగా చెప్పక తప్పదు.