Begin typing your search above and press return to search.
పవన్ సంచలన ప్రకటన...నాపై దాడి చేస్తారేమో!
By: Tupaki Desk | 13 March 2018 2:15 PM GMTజనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఇంకా చెప్పాలంటే అయోమయం సృష్టించారు. పార్టీ నేతలు - తన అభిమానుల ఆలోచనలో పడేసేలా తన భద్రతపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏమైనా జరిగే ప్రభుత్వానిదే బాధ్యత అని పవన్ సంచలన ప్రకటన చేశారు. జనసేన ప్లీనరీ నేపథ్యంలో ఏపీ డీజీపీకి పవన్ లేఖ రాశారు. మార్చ్ 14న జనసేన ఆవిర్భావ సభకు అందిస్తున్న భద్రతకు పోలీసు శాఖకు మనస్ఫూర్తిగా తన కృతజ్ఞతలు తెలిపారు. అయితే మార్చ్ 14వ తారీకు తర్వాత కూడా నాకందిస్తున్న వ్యక్తిగత భద్రతను కొనసాగించవలసిందిగా కోరుతున్నానని పవన్ తెలిపారు.
`నేను భద్రత కోరుతున్నది ప్రదర్శనా కుతూహలంతో మాత్రం కాదు. ప్రస్తుతం సమాజంలో వున్న కుల ఉద్యమాలు - వర్గ పోరాటాలు - రాజకీయ అణచివేతల నడుమ నా భద్రత సున్నితమైన సామాజిక రాజకీయ సమస్యలతో ముడిపడి ఉంది. నా మీద ఏదైనా దాడి జరిగితే ప్రజాజీవితంపై అది తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. గతంలో భీమవరం పట్నంలో నా ఫ్లెక్సీ చింపేసినందుకే దాదాపు రెండువేల మంది నా అభిమానులు ధర్నా చేసినందుకు శాంతి భద్రతలకు విఘాతం అవుతుందనే ఉద్దేశ్యంతో పోలీసువారు కొంతమందిని అదుపులోకి తీసుకోవడం మీ దృష్టిలోకి వచ్చే ఉంటుంది. అలాగే కాకినాడలో నా సభ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాట - విజయవాడలో ఉద్దానం బాధితుల విషయమై ముఖ్య మంత్రి గారిని నేను కలవడానికి వచ్చినప్పుడు దాదాపు రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఇబ్బంది పడిన సందర్భం - ఇటీవలే నేను అనంతపురం ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు జరిగిన తొక్కిసలాట సంఘటనలని దృష్టిలో ఉంచుకుని నేను ఈ భద్రతని కోరుతున్నాను` అని తెలిపారు.
`పోలీసు వారు భద్రత అందించడంలో తమ నిస్సహాయతని ప్రకటిస్తే, నేను రాష్ట్రంలో పర్యటిస్తుండగా నాకు సంబంధించి అనివార్యమైన సంఘటనలు ఏమైనా జరిగితే వాటికి ప్రభుత్వమే బాధ్య త వహించవలసి వస్తుంది. అందువలన పై విషయాలను మీరు సానుభూతితో పరిశీలిస్తారని, నా విన్నపాన్ని మన్నిస్తారని కోరుకుంటున్నాను` అంటూ తన లేఖను ముగించారు. అయితే పవన్ తన భద్రతపై ఆవేదన వ్యక్తం చేయడం, దాడి జరుగుతుందని ఆందోళన తెలపడం కొత్త చర్చకు తెరతీసిందని అంటున్నారు.