Begin typing your search above and press return to search.
ట్వీట్లల్లో తెగువ ఓకే.. చేతల్లో ఎక్కడ పవన్?
By: Tupaki Desk | 27 April 2018 10:50 AM GMTపవన్ తీరు మొదటి నుంచి మిస్టరీనే. చిరు సోదరుడిగా సినిమాల్లోకి వచ్చినా.. అప్పట్లో ప్రముఖ నటులు అనుసరించే తీరుకు భిన్నంగా ఉండేవారు. మీడియాతో మాట్లాడేవారు కాదు. పవన్ ఎంట్రీ ఇచ్చిన టైంలో ఇప్పుడున్నంత మీడియా విస్తృతి ఉండేది కాదు. తమ సినిమా ప్రచారానికి ఎక్కువగా పీఆర్వోలు.. ప్రముఖ పత్రికలకు సంబంధించిన కొందరు రిపోర్టర్లతో క్లోజ్ గా ఉండేవారు. అప్పట్లో సినీ వారపత్రికలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా.. మూడు నెలలకు ఒకసారైనా తమ ఫోటోను కవర్ పేజీగా వవస్తే బాగుండని ఆశించేవారు. అందుకు తగ్గట్లే వ్యవహరించేవారు.
అందరూ కాకున్నా టాలీవుడ్ ప్రముఖు హీరోల్లో దాదాపుగా అందరూ ఇలాంటి తీరునే ప్రదర్శించేవారు. దీనికి మినహాయింపు పవన్ కల్యాణ్. తన సినిమా ఏదో తాను చేసుకెళ్లటం.. మీడియాకు అందుబాటులోకి ఉండకపోవటం లాంటివి చేసేవారు. అసలు పవన్ ను ఎలా కాంట్రాక్ట్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థిత ఉండేది. తనదైన లోకంలో ఉంటారని.. ఎవరిని ఖాతరు చేయరని.. ఆయన దగ్గరకు వెళ్లటం చాలా కస్టమన్న మాటలు చాలానే వినిపించేవి.
మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించే పవన్ తీరు మిగిలిన వారి మాదిరి మీడియాలో వచ్చేది కాదు. అందుకే.. అతడికి సంబంధించిన చిన్న ముక్క వచ్చినా ఆసక్తికరంగా ఉండేది. దీనికి తోడు అతని వ్యక్తిగత జీవితం మిగిలిన వారికి భిన్నంగా ఉండటం.. అదో హాట్ టాపిక్ గాఉండేది.
మధ్యలో గుండు వ్యవహారం మీద ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం మొదలైన చర్చ.. మొన్నటివరకూ సాగి.. పవనే స్వయంగా క్లారిటీ ఇచ్చే వరకూ సాగుతూనే ఉంది. అలాంటి పవన్ చాలా స్వల్ప వ్యవధిలోనే టాప్ స్టార్ గా మారటం.. ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు.
తనక సామాజిక బాధ్యత ఎక్కువని పదే పదే చెప్పే పవన్.. తన సోదరుడు ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు మిగిలిన వారికి భిన్నంగా ఆయన తీరు ఉండేది. ఎవరినైనా టార్గెట్ చేస్తే.. ముఖం పగిలిపోయేలా ఆయన నోటి నుంచి బుల్లెట్ లాంటి మాటలు వచ్చేవి. దూకుడు రాజకీయాలు అప్పటికే ఉన్నా.. మరీ అంత దూకుడా? అన్నట్లుగా ఉండేవి పవన్ మాటలు.
ప్రజారాజ్యం మూసేయటం.. కొంతకాలం కామ్ గా ఉండటం.. జనసేన రూపంలో మళ్లీ ఎంట్రీ ఇవ్వటం.. సాత్వికంగా.. ఆచితూచి అన్నట్లు మాట్లాడుతూనే.. మధ్య మధ్యలో మాత్రం తీవ్రస్థాయిలో విరుచుకుపడటం పవన్ లో కనిపించే భిన్న పార్శాలు. అయితే.. చెప్పిన మాట మీద పవన్ నిలవరన్న ఇమేజ్ ఆయన మీద పడింది. దీనికి తగ్గట్లే ఆయన తీరు ఉండటం కనిపిస్తుంది.
తనను బ్యాడ్ చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పవన్.. ఈ సందర్భంగా తాను చిత్తూరు జిల్లా పర్యటన చేస్తున్నట్లుగా ట్విట్టర్లో పేర్కొన్నారు. ట్వీట్ చేసిన సాయంత్రమే తన టూర్ షెడ్యూల్ ప్రకటిస్తానన్న ఆయన.. కాస్త ఆలస్యంగా ప్రకటించటమే.. అంతలోనే దాన్ని రద్దు చేస్తున్నట్లుగా చెప్పటం కనిపిస్తుంది. గతంలోనూ అనంతపురం జిల్లాలో అనంత రైతుల కష్టాల్ని తెలుసుకునేందుకు వారితో కలిసి తాను పాదయాత్ర చేస్తానన్న పవన్.. ఇప్పటివరకూ ఆ హామీని నిలబెట్టుకోని వైనాన్ని మర్చిపోకూడదు. ఈ రకంగా హామీలు ఇచ్చుకుంటూ పోయే పవన్.. వాటి అమలు విషయంపై దృష్టి పెట్టరా? అన్న సందేహం కలిగేలా వ్యవహరిస్తుంటారు.
తాజాగా చిత్తూరు.. గుంటూరు జిల్లాల పర్యటనల్ని వాయిదా వేస్తున్న ప్రకటించిన జనసే.. దీనికి చూపించిన కారణం చూసినప్పుడు అవాక్కు అవ్వాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ పర్యటన చేపడితే అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయని.. అందుకే తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లుగా జనసేన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ట్వీట్లలో దేనికైనా రెఢీ అన్నట్లుగా చెప్పే పవన్.. పర్యటనల విషయంలో చెబుతున్న మాటలు అతికినట్లుగా అనిపించట్లేదన్న ఆరోపణ ఉంది. బయటకు వచ్చేందుకు పవన్ ఏదో తెలీని జంకు ప్రదర్శిస్తారని.. అది నిజంగా జంకా? లేక.. వ్యూహమా అన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది. ఒకవేళ.. అనుకోని సంఘటనలు జరుగుతాయన్న విషయాన్ని నిర్ణయాన్నిప్రకటించే సమయంలో ఆలోచించారా? అన్న సందేహం కూడా పట్టి పీడిస్తూ ఉంటుంది. మరి.. ఈ సందేహాలకు సమాధానం ఎవరు ఇస్తారు..?