Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ ఆమె చేతుల్లో దెబ్బలు తిన్నాడట!
By: Tupaki Desk | 24 Sep 2018 4:40 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మహిళ చేతిలో దెబ్బలు తిన్నాడట. ఆ దెబ్బల తర్వాత ఇంకెప్పుడూ ఎవరి చేతిలోనూ దెబ్బలు తినకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడట. ఇంతకీ పవన్ ను కొట్టింది ఎవరబ్బా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది కొన్ని దశాబ్దాల కిందటి సంగతి. పవన్ స్కూల్లో చదువుకునే రోజుల్లో విజయలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు అతడిని కొట్టిందట. నెల్లూరులో రొట్టెల పండగకు హాజరైన పవన్.. అలాగే తాను చదువుకున్న పాఠశాలకు వెళ్లి అప్పటి తన బ్యాచ్ మేట్లు.. ఉపాధ్యాయులు కలిసి ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ వేడుకలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన పాఠశాల రోజుల్ని పవన్ గుర్తు చేసుకున్నాడు. ఆసక్తికర విశేషాలు చెప్పాడు. ఇంతకీ ఈ వేడుకలో పవన్ ఏమన్నాడంటే..
‘‘ఆ రోజుల్లో మా విజయ లక్ష్మి టీచర్ కొట్టారు ఒకసారి నన్ను కొట్టారు. ఆమెనెపోలియన్ పాఠం చెబుతుంటే నా పక్కన ఒక ఫ్రెండ్ నెపోలియన్ ఏ పార్టీ అని అడగమని చెప్పాడు. అతడు చెప్పినట్లే నేను అడగడంతో వెటకారంగా భావించి నన్ను టీచర్ కొట్టారు. ఇక్కడ ఆమె చూడగానే నాకు మొదట ఆ దెబ్బే గుర్తుకు వచ్చింది. ఆమె నన్ను కొట్టాక ికపై నేను ఎవరి చేతిలోనూ దెబ్బలు తినకూడదని జాగ్రత్తగా ఉండేవాడిని. అప్పట్లో నేను పెద్దగా అల్లరి కూడా చేసేవాడిని కాదు. ఉపాధ్యాయుల్ని ఆటపట్టించే తెలివితేటలు కూడా లేవు. కష్టపడి చదవాలనే తపన ఉండేది. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఇలా పోరాటం చేయడానికి కారణం స్కూలు రోజుల్లో నేను నేర్చుకున్న పాఠాలు, విలువలే. నాకు మా టీచర్లు పాఠాలు నేర్పలేదు. విలువలు నేర్పారు. చాలా మంది నటుడినయ్యాయాక నాకు రాజకీయాల మీద ఆసక్తి పుట్టిందని అనుకుంటారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి ప్రజా సమస్యలపై ఏదైనా చేయాలనే తపన ఉంది. స్కూల్ రోజుల్లో ఉదయం అసెంబ్లీ అయ్యాక ఒక మంచి దేశభక్తి పాట పెట్టి అందరినీ డ్రిల్ చేసుకుంటూ వెళ్లమని చెప్పేవారు. అది నాకు చాలా చాలా స్ఫూర్తినిచ్చేది. నా చిన్న నాటి విషయాలు, స్నేహితులతో గడిపిన రోజులును నాకు ఇప్పటికీ గుర్తున్నాయి’’ అని పవన్ చెప్పాడు.