Begin typing your search above and press return to search.

అర్జంటుగా ఢిల్లీలో ల్యాండ్ అయిన పవన్... మోడీ షాలతో....?

By:  Tupaki Desk   |   19 Oct 2022 5:36 PM GMT
అర్జంటుగా ఢిల్లీలో ల్యాండ్ అయిన పవన్... మోడీ షాలతో....?
X
మొత్తానికి పవన్ కళ్యాణ్ ఏపీ కుదుపు ఢిల్లీలో రీ సౌండ్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇచ్చిన షేక్ హ్యాండ్ తో బీజేపీ జాతీయ పెద్దలకు ఉలికిపాటును కలిగించింది. దాంతో బీజేపీ పెద్దల పిలుపు ఆయనకు వచ్చింది అంటున్నారు. దాంతో హుటాహుటిన పవన్ ఢిలీ ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది అంటున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిన పవన్ అక్కడ కొద్ది గంటలు కూడా గడపకముందే ఢిల్లీ నుంచి వర్తమానం రావడంతో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఏర్పడింది.

ఇక ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీలో తాజా రాజకీయ పరిణామాలను కేంద్ర పెద్దలకు వివరించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఏపీలో పవన్ చంద్రబాబు భేటీ మీద పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్న బీజేపీ పెద్దలు ఇపుడు ఆయనతో కూడా కీలక సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఒక వైపు చూస్తే ఏపీలో టీడీపీ జనసేన కలసి ముందుకు సాగుతారు అనే టీడీపీ అనుకూల మీడియా హోరెత్తిస్తోంది. అదే సమయంలో జనసేన వర్గాలు మాత్రం పవన్ జస్ట్ ఆలా బాబుతో కర్టసీ భేటీ మాత్రమే చేశారని పొత్తులు అన్నవి అసలు ఎక్కడా ప్రస్థావనకు రాలేదని చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారం మాత్రం సంచలనం రేపడంతో బీజేపీ కేంద్ర అధినాయకత్వం అలెర్ట్ అయింది.

అసలు వాస్తవాలను తెలుసు కోవడమే కాకుండా పవన్ ఎందుకు ఈ విధంగా తమకు దూరం జరుగుతున్నారు. ఈ గ్యాప్ కి కారణం ఏంటి అన్నది కూడా పూర్తి స్థాయిలో విశ్లేషించి పవన్ తో వీలైతే ఎలాంటి అరమరికలు మొహమాటాలకు తావులేని విధంగా చర్చలు జరిపి బీజేపీ జనసేన పొత్తును అలాగే కంటిన్యూ అయ్యేలా చూస్తారనే అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీ రాజకీయాల్లో బీజేపీకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. అటు టీడీపీకి ఇటు వైసీపీకి సమదూరంలో ఉండాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది అంటున్నారు.

కనీసం 2024 ఎన్నికల ముందు వరకూ తమ స్టాండ్ ఏంటి అన్నది చెప్పకుండా ఏపీలో రాజకీయ పరిణామాలను గమనిస్తూ అన్ని రకాలుగా ఉన్న అవకాశాలను వాడుకోవాలన్నదే బీజేపీ పెద్దల ఆలోచన. అందువల్ల ముందుగా ఆవేశపడో లేక మరో విధంగా తొందరపడో పొత్తులు పెట్టుకుని ముందర కాళ్లకు బంధాలు వేసుకుంటే అది రాజకీయంగా తెలివితక్కువ వ్యూహం అవుతుంది అన్నదే బీజేపీ పెద్దల యోచన.

అందుకే పవన్ కి తమ మనసులో మాటను వివరించి ఆయనకు ఏర్పడిన అపార్ధాలను తొలగిస్తారు అని అంటున్నారు. వీలైతే పవన్ కోరుకున్న తీరులో కాకపోయినా తాము అనుకుంటున్న దానిపై ఒక పక్కా క్లారిటీతో కూడిన రోడ్ మ్యాప్ ని పవన్ కి ఇస్తారని అంటున్నారు.

ఆ మీదట ఆయన మనసులఒ ఏముదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. ఇక జనసేన విషయం తీసుకుంటే కర్టసీ కాల్ అని టీడీపీ విషయంలో చెబుతున్నా బీజేపీతో ఇపుడే విడిపోవాలని కూడా అనుకోవడం లేదు ఒక విధంగా బీజేపీకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి తాము అనుకున్న తీరున రోడ్ మ్యాప్ అయితే తెప్పించుకోవాలన్న వ్యూహం ఉంది అంటున్నారు.

ఇలా ఎవరికి వారుగా తమదైన ఆలోచనలతో ఉంటూ ముందుకు సాగుతున్న నేపధ్యంలో ఢిల్లీలో పవన్ భేటీ ఎలా సాగుతుంది. బీజేపీ కేంద్ర పెద్దలను ఎవరెవరిని కలుస్తారు, మోడీ, అమిత్ షాలతో కూడా మీటింగ్ ఉంటుందా అన్నదే చూడాలి. ఏది ఏమైనా పవన్ ఢిల్లీ టూర్ తరువాత ఏపీ రాజకీయాలు పొత్తుల విషయంలో ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.