Begin typing your search above and press return to search.
అభ్యర్థులతో సమీక్ష పెట్టిన పవన్.. ఎందుకంటే?
By: Tupaki Desk | 21 April 2019 10:31 AM GMTఎప్పుడేం చేస్తారో ఏ మాత్రం అర్థం కాని విధంగా వ్యవహరించటంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుంటారు. ఇంకేం ఉంది ఏపీలో ఎన్నికలు జరగాలే కానీ.. పవర్ మొత్తం తన చేతుల్లో ఉన్నట్లుగా చెప్పటం తెలిసిందే. అయితే.. వాస్తవం అందుకు భిన్నంగా ఉండటం ఒక ఎత్తు అయితే.. అసలు పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయం మీదా క్లారిటీ లేదట.
అందుకే.. ఎన్నికల పోలింగ్ ముగిసిన పది రోజుల తర్వాత.. కాస్త రిలాక్స్ అయిన పవన్.. జిల్లాల వారీగా అభ్యర్థులతో సమీక్షా సమావేశాన్నినిర్వహించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రోజు మంగళగిరిలో నిర్వహించిన ఈ సమీక్షలో శ్రీకాకుళం.. విజయనగరం.. విశాఖతోపాటు ఉభయ గోదావరి.. కృష్ణా జిల్లాల్లో బరిలో ఉన్న నేతలను పార్టీ ఆఫీసుకు రమ్మన్నారు.
ఓపక్క అధికార.. విపక్షాలు పోటాపోటీగా 120 సీట్లలో గెలుపు తమదేనన్న ధీమాను ఒకరైతే.. మీకు 130 సీట్లేనా?. మాకు 150 సీట్లు పక్కా అంటూ మరో రాజకీయ పార్టీలు జోరుగా స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్న వేళ. జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై ఒక క్లారిటీ తెచ్చుకోవటానికే తాజా సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తమకు వందకు పైనే సీట్లు వస్తాయని అధికార.. విపక్షాలు చెబుతున్న వేళ.. తమకు ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై పవన్ తన సైన్యంతో మదింపు మొదలెట్టేశారని చెప్పాలి. మరి.. సమీక్షలు అన్ని అయ్యాక అయినా.. పార్టీకి వచ్చే సీట్ల లెక్క కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి పవన్?