Begin typing your search above and press return to search.
పరిటాల ఇంట్లో పవన్ కు అల్పాహార విందు
By: Tupaki Desk | 28 Jan 2018 4:52 AM GMTచలోరే..చలోరే..చల్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రెండో రోజు అనంతపురం జిల్లాలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. ఇంటికి వచ్చిన పవన్‌కు పరిటాల సునీత - మంత్రి తనయుడు పరిటాల శ్రీరామ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… అనంతపురం జిల్లా సమస్యల్ని అర్థం చేసుకోవడానికే పరిటాల కుటుంబాన్ని కలిశానన్నారు. ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తానన్నారు. కాగా పవన్-పరిటాల కుటుంబ సభ్యుల భేటీ ఆసక్తిగా మారింది.
కదిరికి బయలుదేరే ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ - ఏపీ మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. పవన్ ను ఆహ్వానించిన పరిటాల శ్రీరామ్ - ఆయన్ను లోపలికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పరిటాల వారింట పవన్ కల్యాణ్ అల్పాహారాన్ని తీసుకున్నారు. దాదాపు గంట పాటు సునీతతో పలు విషయాలపై పవన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. రాయలసీమలో కరవు పరిస్థితులు - రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు - ప్రజలకు తాగు నీటి సమస్య తదితరాలపై వీరు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.
రాప్తాడు నియోజకవర్గంలో విజయవంతంగా నీరు పారించడంపై అడిగి పవన్ అడిగి తెలుసుకున్నారు. జలవనరులశాఖ ఇంజనీర్ల ద్వారా పూర్తి సమాచారం ఇచ్చేందుకు మంత్రి పరిటాల సునీత ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ సమస్యల సత్వర పరిష్కారానికి ఓ మెమొరాండం తీసుకుని తాను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లనున్నానని పవన్ చెప్పారు. పరిటాల సునీత మాట్లాడుతూ - పవన్ తన ఇంటికి అతిథిగా రావడం ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. జిల్లా సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయని - పవన్ ఇచ్చే సలహా - సూచనలనూ తీసుకుంటామని తెలిపారు.