Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ ఇప్పటికైనా బయటకు వస్తావా?

By:  Tupaki Desk   |   8 Aug 2015 4:42 PM GMT
పవన్ కల్యాణ్ ఇప్పటికైనా బయటకు వస్తావా?
X
ఏపీలో ఏం జరిగినా.. చాలామందికి వెంటనే గుర్తుకొచ్చేది పవన్ కల్యాణ్ పేరే. ఎందుకంతగా ఆయన గుర్తుకు వస్తారు? ప్రశ్నించే పవన్ కల్యాణ్ ఇప్పడేం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తుంటారు. వారందరి ప్రశ్నల్లో పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదన్న ప్రశ్న ఉంటుంది.

తాజాగా తిరుపతిలో కాంగ్రెస్ నిర్వహించిన పోరు సభలో తిరుపతికి చెందిన ఒక యువకుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తన ఒంటి మీద కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకునే ప్రయత్నం చేశారు. తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు తీవ్రంగా ఉంది.

ఈ సందర్భంగా పలువురి నోటి నుంచి వచ్చిన మాట.. పవన్ కల్యాణ్. ప్రశ్నించే పవన్ ఇప్పటికైనా బయటకు వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేస్తుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. నటుడు శివాజీ మాటల్లో చెప్పాలంటే.. పవన్ కల్యాణ్ కానీ బయటకు వచ్చి.. ఏపీ ప్రత్యేకహోదా గురించి గట్టిగా నిలబడితే.. 45 రోజుల్లో రావటం ఖాయమని చెబుతున్నారు.

ఒక్క శివాజీ మాత్రమే కాదు.. పలువురు నేతలు సైతం పవన్ జపం చేయటం మర్చిపోకూడదు. ఏపీ ఎంపీలు పలువురు.. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి బయటక రావాలని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదంతా పవన్ మీద నమ్మకం మాత్రమేనని గుర్తించాలి. పవన్ లాంటి శక్తివంతమైన నేత కానీ రోడ్డు మీదకు వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఖాయంగా వస్తుందన్న నమ్మకంతో.. ఈ డిమాండ్ వస్తుందన్న విషయాన్ని పవన్ గుర్తిస్తారో లేదో చూడాలి. ఏపీకి ప్రత్యేక హోదా వెనువెంటనే ఇవ్వాలన్న డిమాండ్ ను పవన్ చేపడతారా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.