Begin typing your search above and press return to search.
తమిళనాడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన
By: Tupaki Desk | 3 Sep 2021 12:30 PM GMTతమిళనాడు అసెంబ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనకు రావడం విశేషంగా మారింది. ఏపీ , తెలంగాణల్లో పవన్ ను తలుచుకోవడం కామన్ కానీ.. తమిళనాడు అసెంబ్లీలో పవన్ ప్రశంసలను అన్వయించుకోవడమే ఇక్కడ వెరైటీగా చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎంను ఎలా పొగిడారో చదవి మరీ వినిపించాడు తమిళనాడు ఆర్థిక మంత్రి సుబ్రహ్మణియన్. దీంతో తమిళ అసెంబ్లీలో పవన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. పనిలో పనిగా చిరంజీవి పేరు కూడా సీన్ లోకి తెచ్చాడు.
ఇటీవల పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో సీఎం స్టాలిన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. రాజకీయాలంటే మీవేనంటూ కితాబిచ్చారు. రాజకీయ నాయకులందరికీ మీరే ఆదర్శమని అన్నారు. ‘అధికారంలోకి రాకముందే రాజకీయం చేయడం తప్పులేదని.. కానీ వచ్చాక అసలు రాజకీయాలను పక్కనపెట్టి ఆదర్శ పాలన చేస్తున్న స్టాలిన్ ను దేశమంతా ఆదర్శంగా తీసుకోవాలని ’ పవన్ ఇటీవల ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ట్వీట్ను తమిళనాడు ఆరోగ్యమంత్రి అసెంబ్లీలో చదివి వినిపించారు. అసెంబ్లీలో సమస్యలు ప్రస్తావించండి.. నా భజన చేయకండి అని సీఎం స్టాలిన్ సహచరులకు వార్నింగ్ ఇచ్చి 10 రోజులు గడవక ముందే ఆరోగ్యమంత్రి ఆయనను పొగిడేందుకు పవన్ ట్వీట్ ను వాడుకోవడం విశేషం. పవన్ ట్వీట్ ను తెలుగులో చదివి దాని అర్థాన్ని తమిళంలో చెప్పాడు మంత్రి సుబ్రహ్మణియన్.
ఇప్పటికే చిరంజీవి తమిళనాడు వెళ్లి మరీ సీఎం స్టాలిన్ ను కలిసి అభినందనలు తెలిపారు. పవన్ ట్వీట్ రూపంలో అభినందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల విషయంలో పెద్దగా స్పందించని ఈ అన్నాదమ్ముళ్లు తమిళనాడు విషయంలో మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు. అంటే దానర్థం ఇక్కడి సీఎంల పాలన వీరికి నచ్చడం లేదా? అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

@PawanKalyan @KChiruTweets Meeru super boss big boss