Begin typing your search above and press return to search.
ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేనాని!
By: Tupaki Desk | 9 May 2018 5:05 PM GMTజనసేనాని - సినీ నటుడు పవన్ కల్యాణ్ కు దేశభక్తి ఎక్కువన్న సంగతి తెలిసిందే. తాను నటించిన కొన్ని సినిమాల్లో దేశభక్తిని చాటేలా పాటలు - సన్నివేశాలు ఉండడం అందుకు నిదర్శనం. దేశంలోని ప్రజలంతా విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు పాటించినా...అందరం భారతీయులమేనని గతంలో పవన్ అన్నారు. దేశభక్తికి - జాతీయ సమగ్రతను పెంపొందించే కార్యక్రమాలకు పవన్ తప్పక హాజరవుతుంటారు. ఈ నేపథ్యంలోనే రేపు హైదరాబాద్ లో జరగబోతోన్న ఓ కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ జాతీయ జెండాను పవన్ ఆవిష్కరించనున్నారు. రేపు భాగ్యనగరంలో జరగబోతోన్న మొదటి స్వాతంత్ర్య సంగ్రామ దినోత్సవ కార్యక్రమానికి పవన్ హాజరవుతారని జనసేన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది.
1857 మే 10వ తేదీన మొదటి స్వాతంత్ర్య సంగ్రామం మొదలైన సంగతి తెలిసిందే. ఆ మహాసంగ్రామం....18 నెలలపాటు కొనసాగి 1858 నవంబరులో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆ మహా సంగ్రామాన్ని పురస్కరించుకుని రేపు హైదరాబాద్ లో ఓ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆ కార్యక్రామానికి ముఖ్య అతిథిగా హాజరుకాబోతోన్న పవన్....ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. 22326 చదరపు అడుగులున్న ఈ జెండాను పవన్ ఆవిష్కరించబోతున్నారు. ఈ జెండా 122 అడుగుల వెడల్పు - 183 అడుగుల పొడవు ఉంటుంది. ఎన్టీఆర్ స్టేడియంలో రేపు ఉదయం 10 గంటలకు ఆ కార్యక్రమానికి పవన్ హాజరవుతారని జనసేన అధికారిక ట్విట్టరు ఖాతాలో ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతి - శాస్త్రవేత్త అబ్దుల్ కలాం ఆశయసాధన కోసం స్థాపించిన వైబ్రంట్స్ సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన కలాం ఆశయాలను తెలియజేసేలా....*కలామిజం*ను ఈ సంస్థ ప్రచారం చేస్తోంది.