Begin typing your search above and press return to search.

నంద్యాల ఉప ఎన్నికల విష‌యంలో ప‌వ‌న్ క్లారిటీ

By:  Tupaki Desk   |   16 Aug 2017 11:32 AM GMT
నంద్యాల ఉప ఎన్నికల విష‌యంలో ప‌వ‌న్ క్లారిటీ
X
నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో జ‌న‌సేన పార్టీ అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధినేత ఊరించి ఉసూరుమ‌నిపించార‌నే టాక్ వినిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలో బ‌రిలో దిగ‌డంపై ఒక ప‌ట్టాన తేల్చ‌ని ప‌వ‌న్...నామినేష‌న్ల ప్ర‌క్రియ పూర్త‌యిన త‌ర్వాత ఎవరికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం అనే విష‌యంలో ఇదే ఉత్కంఠ‌ను కొన‌సాగించారు. తాజాగా ఈ విష‌యంలో క్లారిటీ ఇచ్చిన జ‌న‌సేనాని...ఈ ఎన్నిక‌ల్లో తాము త‌ట‌స్థ‌మ‌ని ప్ర‌క‌టించారు.

నంద్యాల ఉపఎన్నికపై జనసేన స్టాండ్‌ కోసం అన్నివ‌ర్గాలు ఎదురుచూస్తున్న నేప‌థ్యంలో యూట్యూబ్ వీడియో ద్వారా ఆ పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఉపఎన్నికలో జనసేన పార్టీ తటస్థంగా ఉంటుందని ప్రకటించారు. జనసేన ఎవరికో మద్దతు ఇస్తుందంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని పవన్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో ఒకింత ఆల‌స్యంగా తాను స్ప‌ష్ట‌త ఇస్తున్న‌ప్ప‌టికీ..వివిధ వ‌ర్గాల నుంచి స‌మాచార సేక‌ర‌ణ‌ - జ‌న‌సేన వ‌ర్గాల అభిప్రాయం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని మ‌ద్ద‌తు విష‌య‌మై చెప్తున్న‌ట్లు వివ‌రించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్న‌ట్లే కాకినాడ కార్పొరేషన్ లో పోటీ చేయబోమ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

తమ పార్టీ ఇంకా నిర్మాణ దశలోనే ఉందని తెలిపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ 2019 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోమని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరిగాకే తాము ఎన్నికలకు వెళ్తామని పవన్ కల్యాణ్ అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ - బీజేపీకి మద్దతు ఇచ్చిన‌ పవన్ నంద్యాలలో టీడీపీ పోటీ చేస్తున్నప్ప‌టికీ ఆ పార్టీకి తమ మద్దతు లేదని ప్రకటించి తన వైఖరిని స్పష్టం చేయ‌డం ఆస‌క్తికరంగా మారింది. అదే స‌మ‌యంలో త‌మ మ‌ద్ద‌తు విష‌యంలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ప‌వ‌న్ కొట్టిపడేసి ఏ పార్టీకి...ఏ అభ్యర్థికి జనసేన మద్దతు ఉండదని చెప్ప‌డం చూస్తుంటే...రాబోయే స‌మీక‌ర‌ణ‌ల‌కు ఇది నిద‌ర్శ‌నమా అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.