Begin typing your search above and press return to search.

అనుకున్న‌దే: ప‌వ‌న్ డుమ్మా కొట్టేశాడు

By:  Tupaki Desk   |   22 Oct 2015 5:43 AM GMT
అనుకున్న‌దే: ప‌వ‌న్ డుమ్మా కొట్టేశాడు
X
అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్రమం షురూ అయ్యింది. స్వ‌దేశీ.. విదేశీ ప్ర‌ముఖులు.. అతిధులు ఒక్కొక్క‌రిగా వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నారు. పిలుపుల పంచాయితీతో మ‌న‌సు నొచ్చుకున్నార‌ని చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి డుమ్మా కొట్టేశారు.

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న నేప‌థ్యంలో.. శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని ప‌వ‌న్ చెప్ప‌టం తెలిసిందే. అయితే.. సీమాంధ్రుల‌కు పండ‌గైన శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం కంటే త‌న సినిమా షూటింగ్ ఎక్కువ‌న్న విషయాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు. అయితే.. ఇందులో నిజం లేద‌ని.. శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి ఆహ్వానించే విష‌యంలో ప‌వ‌న్ ను చిన్న‌బుచ్చుకునేలా పిల‌వ‌టం వ‌ల్ల‌నే ఆయ‌న ఈ కార్య‌క్రమానికి దూరంగా ఉన్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

నిజానికి అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి తాను హాజ‌రు కావాల‌ని ప‌వ‌న్ కోరుకున్నార‌ని.. అయితే.. ఏపీ స‌ర్కారు త‌న ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన ధోర‌ణి ప‌వ‌న్ కు క‌ష్టాన్ని క‌లిగించిందంటున్నారు.

స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా షూటింగ్ ప‌వ‌న్ కు అత్య‌వ‌స‌ర‌మేమీ కాద‌ని.. ఆయ‌న ఒక పూట షూటింగ్‌ లో పాల్గొన‌క‌పోవ‌టం జ‌రిగే న‌ష్టం చాలా ప‌రిమిత‌మ‌ని.. అయితే.. బాబు స‌ర్కారు మీద త‌న‌కున్న అసంతృప్తిని వ్య‌క్తం చేసి ర‌చ్చ చేయ‌కుండా.. హుందాగా వ్య‌వ‌హ‌రించేందుకే షూటింగ్ అంశాన్ని తెర‌పైకి తీసుకొచ్చారంటున్నారు. మొత్తంగా పిలుపుల పంచాయితీలో భాగంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి గైర్హాజ‌రు కావ‌టం ఖాయ‌మ‌న్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ప‌వ‌న్ డుమ్మా కొట్టేశార‌ని చెప్పొచ్చు.

Buy Bricks Online and Contribute to Amaravathi : http://amaravati.gov.in/EBRICKS/Index.aspx