Begin typing your search above and press return to search.

ఆధారాలున్నాయి:అమ‌రావ‌తికి ప‌వ‌న్ రావ‌ట్లేదు

By:  Tupaki Desk   |   20 Oct 2015 2:03 PM GMT
ఆధారాలున్నాయి:అమ‌రావ‌తికి ప‌వ‌న్ రావ‌ట్లేదు
X
జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి శంఖుస్థాప‌న‌కు వ‌స్తున్నారా? లేదా? ఆహ‌్వాన ప్ర‌తిక‌ను అంద‌జేసిన‌పుడే త‌న రాక‌పై సందేహాస్ప‌ద స‌మాధానం ఇచ్చిన ప‌వ‌న్....ఆ మేర‌కు నిజంగానే వేడుక‌కు హాజ‌ర‌వ‌డం లేదా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా ఇందుకు త‌గిన ఆధారాలు సైతం వెలుగులోకి వ‌చ్చాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న రాబోయే సినిమా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ షూటింగ్‌ లో బిజీబిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ షూటింగ్ కోస‌మే తాను గుజ‌రాత్ వెళుతున్నాన‌ని, అందువ‌ల్లే త‌ను హాజ‌రుకాక‌పోవ‌చ్చున‌ని ప‌వ‌న్ చెప్పారు. సినిమా చిత్ర‌క‌ర‌ణ‌లో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోమ‌వార‌మే గుజ‌రాత్‌ కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు విడుద‌ల‌య్యాయి. ఫొటోలతో స‌హా ప‌వ‌న్ గుజ‌రాత్‌ లో ల్యాండ్ అయింది వెలుగులోకి వ‌చ్చిన నేప‌థ్యంలో ప‌వ‌న్ అమ‌రావ‌తి శంఖుస్థాప‌న‌కు రావ‌డంలేద‌ని ఖ‌రార‌యిపోయింది.