Begin typing your search above and press return to search.
లోకేష్ పై క్లారిటీ.. పవన్ కథేంటి?
By: Tupaki Desk | 10 March 2019 4:57 AM GMTపేరుకేమో ఆయా పార్టీలకు ముఖ్య నేతలు అయితే వీరి ప్రత్యక్ష పోటీ మాత్రం ఒక మిస్టరీనే. చంద్రబాబు వంటి సీనియర్ పొలిటీషియన్ కు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా - నామినేటెడ్ పదవితో మంత్రి పదవిని తీసుకున్నారు. ప్రత్యర్థులు కూడా ఆ విషయంలో విమర్శలు చేశారు. అయితే లోకేష్ వాటిని లైట్ తీసుకున్నారు. నామినేటెడ్ పదవితో మంత్రి కావడం కూడా చాలా గొప్ప అయినట్టుగా లోకేష్ చెప్పుకొంటూ ఉంటారు.
తన విషయంలో ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నా - అదో గొప్ప అని లోకేష్ మురిసిపోవడమే కామెడీ. ఇక మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఒక మిస్టరీనే. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా కసరత్తు చేయిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. చాలా నియోజకవర్గాల విషయంలో సర్వేలు చేపట్టి.. తన తనయుడికి ఏ సీటు అయితే సేఫ్ అనే విషయం గురించి బాబు తేల్చారట.
చివరకు భీమిలిని ఎంచుకుంటున్నట్టుగా సమాచారం. అయితే అది ఇంకా అధికారికం కాదు. కేవలం భీమిలి పేరును ప్రస్తావిస్తున్నారు. అక్కడ నుంచి లోకేష్ పోటీ అని అంటున్నారు. ఒక రకంగా కొంత వరకూ క్లారిటీ వచ్చినట్టే. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోతే మరింత పరువు నష్టం కాబట్టి లోకేష్ అమీతుమీ తేల్చుకోవాల్సిందే. అది భీమిలి నుంచి అంటున్నారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి!
ఇక లోకేష్ విషయంలో ఇలా క్లారిటీ వచ్చినట్టే. మరి పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి? అనేది రాజకీయంగా ఆసక్తి దాయకంగా నిలుస్తున్న అంశం. ఈ ఎన్నికలతో పవన్ కల్యాణ్ తన పార్టీని ప్రత్యక్ష పోరాటంలో నిలపబోతున్నారు. అభ్యర్థుల విషయంలో కసరత్తు సాగుతూ ఉంది. అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు తీసుకున్నారు. ఆ తర్వాత వాటి అప్ డేట్స్ ఏమిటో చెప్పడం లేదు జనసేన.
అంతే కాదు.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం మీద కూడా ఆ పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు. పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారనేది ప్రశ్నార్థకమే. తను అనంతపురం నుంచి పోటీ అని..అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత దాని ఊసు లేదు. ప్రస్తుతానికి అయితే అనంతపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ లేనట్టే అని అనుకోవాలి.
మరెక్కడ నుంచి అంటే.. జనసేన ఈ విషయంలో చాలా నియోజకవర్గాల పేర్లను చెప్పింది. అయితే ఎక్కడ నుంచి పోటీ అనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. రేపుమాపో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో కూడా.. పవన్ కల్యాణ్ పోటీ ఎక్కడనే విషయం మీద స్పష్టత లేదు. తను ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అంశం గురించి పార్టీనే ఆదేశించాలని పవన్ కల్యాణ్ కూడా కోరారట. మరి ఈ విషయంలో జనసేన ఏం తేల్చిందో, ఎప్పటికి తేలుస్తుందో!