Begin typing your search above and press return to search.

ఓపెన్ గా మాట్లాడే ప‌వ‌న్ మాట దాటేయ‌ట‌మా?

By:  Tupaki Desk   |   8 July 2019 4:57 AM GMT
ఓపెన్ గా మాట్లాడే ప‌వ‌న్ మాట దాటేయ‌ట‌మా?
X
ఒక్కో రాజ‌కీయ నేత‌కు ఒక్కో స్టైల్ ఉంటుంది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్ర‌జ‌ల్లో క‌ల‌వ‌రు. కానీ.. అదే ప్ర‌జ‌ల్ని త‌న మాట‌ల‌తో ప్ర‌భావితం చేయ‌ట‌మే కాదు.. భావోద్వేగానికి గురి చేసి రాజకీయ ల‌బ్థి పొంద‌టంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా. టీడీపీ అధినేత చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే.. నిస్సారంగా మాట్లాడ‌టంతో పాటు..ఆయ‌న మాట్లాడితే చాలు.. ప్ర‌త్య‌ర్థికి బంద‌ర్ ల‌డ్డూ చేతిలో పెట్టిన‌ట్లే. ఇలా ఒక్కొక్క‌రికి ఒక్కో స్టైల్ ఉంటుంది.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యానికి వ‌స్తే..ఎలాంటి ప్ర‌శ్న అయినా రియాక్ట్ అవుతారు.ఒక‌వేళ చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంటే.. ఆ విష‌యాన్ని మాట‌ల్లో చెప్పేస్తారు. అంతేకానీ.. మాట దాటేయటం.. ఒక ప్ర‌శ్న‌కు సంబంధం లేని మ‌రో స‌మాధాన్ని చెప్ప‌టం లాంటివి చేయ‌రు. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

తాజాగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న‌ ప‌వ‌న్ ను ఒక టీవీ ఛాన‌ల్ ప్ర‌తినిధి కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు. అందులో ముఖ్య‌మైన‌ది.. ప్ర‌ధాని మోడీకి అత్యంత స‌న్నిహితుడిగా వ్య‌వ‌హ‌రించే రాంమాధ‌వ్ తో ప‌వ‌న్ ప్రైవేటు భేటీ గురించి ప్ర‌శ్నించారు. దీనికి ప‌వ‌న్ త‌న స్టైల్ కు భిన్న‌మైన రీతిలో రియాక్ట్ కావ‌టం గ‌మ‌నార్హం.రాంమాధ‌వ్ తో మీరు భేటీ అయిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోందన్న ప్ర‌శ్న‌కు ప‌వ‌న్ స్పందిస్తూ.. అవునా.. అలా ఉందా? అలా అంటున్నారా? అంటూ న‌వ్వుతూ ఎదురు ప్ర‌శ్నించారే త‌ప్పించి.. ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌టం విశేషం.

బీజేపీ నేత‌లు ఊరికే ఏ ప‌ని చేయ‌రు. అలాంటివేళ‌.. ప‌వ‌న్ తో సుదీర్ఘ భేటీ వెనుక ఆస‌క్తిక‌ర అంశం ఉంటుంద‌ని చెప్పక త‌ప్ప‌దు. రాంమాధ‌వ్ గురించి తెలిసిందే.. తాను చేసే ప‌నికి సంబంధం లేని మాట‌లు మాట్లాడుతుంటారు. ప‌వ‌న్ నోటి నుంచైనా స‌మాధానం వ‌స్తుంద‌నుకుంటే.. ఆయ‌న సైతం త‌న తీరుకు భిన్న‌మైన రీతిలో రియాక్ట్ కావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ఎపిసోడ్ ను చూసిన‌ప్పుడు ప‌వ‌న్ తీరులో మార్పురావ‌ట‌మే కాదు.. ఆయ‌న స్పంద‌న మ‌రిన్ని క్వ‌శ్చ‌న్లు మదిలో మెదిలేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.