Begin typing your search above and press return to search.
ఛాన్సు మిస్సయ్యానే:బాధపడ్తున్న పవన్ కల్యాణ్
By: Tupaki Desk | 9 Sep 2015 3:48 AM GMTఛాన్సు మిస్సయ్యానే.. అపురూపమైన ఛాన్సు.. మళ్లీ మళ్లీ దక్కుతుందో లేదో.. భలే మిస్సయ్యానే.. అని పవన్ కల్యాణ్ ఇప్పుడు విపరీతంగా బాధపడిపోతున్నాడట. చిన్న మాట అని ఉంటే మన ఇమేజి అమాంతం పెరిగి ఉండేదే.. ఎక్కువ మొహమాటానికి పోవడం వలన.. చాలా నష్టపోయామే.. అని మధనపడుతున్నాడట. ఇంతకూ పవన్ ఏం ఛాన్సు మిస్సయ్యాడబ్బా.. ఆయనకు ఎవరు ఎలాంటి ఆఫర్లు ఇచ్చారా..? అని అనుకుంటున్నారు కదా! ఇది సినిమా ఛాన్సులకు సంబంధించిన వ్యవహారం కాదులెండి. జస్ట్ పొలిటికల్.
పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్రమోడీతో చాలా దగ్గరి పరిచయాన్ని కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదేమాదిరిగా రాష్ట్రంలో కూడా తెలుగుదేశానికి అనుకూలంగానే ఉంటున్నారు. అయితే రాజధాని అమరావతి నిర్మాణంలో మాత్రం.. రైతుల నుంచి భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి భూములు లాక్కోవాలనే పద్ధతిని ఆయన వ్యతిరేకించారు. చంద్రబాబు చెప్పిన పూలింగ్ ప్రకారం ఇస్తే ఓకే గానీ.. భూసేకరణ ద్వారా లాక్కోవద్దని అన్నారు.
అయితే ఇక్కడ ఇంతలా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్.. కేంద్రంలో మోడీ తెస్తున్న భయంకరమైన భూసేకరణ కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. మోడీ ని మాత్రం మాట అనరని అందరూ ఎద్దేవాచేశారు. పవన్ పట్టించుకోలేదు. కానీ మోడీ తెచ్చే చట్టాన్ని తప్పుపట్టనూ లేదు.
తీరా ఇప్పుడు మోడీనే వెనుకడుగు వేస్తున్నారు. ''అయ్యయ్యో అప్పట్లో ఒక్క మాట ఆ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే.. పవన్ చాలా ధైర్యవంతుడు, మోడీ నైనా సరే తప్పు చేస్తే విమర్శిస్తాడు' అనే కీర్తి దక్కి ఉండేది కదా'' అని పవన్ మధన పడిపోతున్నాట్ట. అయినా మోడీ భూసేకరణచట్టంలో సవరణలు చేసేస్తుండగా ఇప్పుడు బాధపడి ఏం లాభం?