Begin typing your search above and press return to search.
అవిశ్వాసంపై ఢిల్లీలో ఏదో చేస్తానన్నావుగా పవన్?
By: Tupaki Desk | 16 March 2018 7:57 AM GMTమాట చెబితే దాని మీద నిలబడాలి. మిగిలిన రంగాల్లో ఎలా ఉన్నా రాజకీయాల్లో మాత్రం మాట చాలా కీలకం. ఏదైనా చెప్పేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి మాట చెప్పాల్సి ఉంటుంది. తాను సరిగ్గా ఇదే తరహాలో మాట్లాడతానని తరచూ చెబుతుంటారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మరి.. అంత కమిట్ మెంట్ తో మాట్లాడే పెద్దమనిషి.. తన మాటకు చేతలకు ఎందుకంత వ్యత్యాసం ఉంటుందన్నది అర్థం కానిదిగా ఉంటుంది.
ఆ మధ్యన హోదా ఎపిసోడ్ లో కేంద్రంపై అవిశ్వాసం పెడితే తాను ఢిల్లీకి వచ్చి మరీ లాబీయింగ్ చేస్తానని.. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన ఎంపీల మద్దతు కూడగట్టేందుకు దేశ రాజధానికి వస్తానంటూ బీరాలు పలకటం మర్చిపోలేం. దమ్ముంటే కేంద్రం మీద అవిశ్వాసం పెట్టండంటూ తొలుత రేపింది పవనే. బలం లేదని వెనక్కి తగ్గమాకండి.. నేనూ సీన్లోకి వస్తానని ఎగదోసింది పవనే.
మరిన్ని మాటలు చెప్పిన పెద్దమనిషి.. ఇప్పుడేం చేస్తున్నారు? ఓ పక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్రంలోని మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిన క్రమంలో.. అందుకు అవసరమైన సహాయ సహకారాల్ని అందిస్తానన్న పవన్.. ఎలాంటి చప్పుడు చేయకుండా అమరావతిలో కూర్చోవటం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
హోదా సాధన కోసం మోడీ సర్కారుపై అవిశ్వాసం పెట్టాలంటూ పవన్ విసిరిన సవాలుపై ఏపీ అధికారపక్షం వెనక్కి తగ్గినా..తనకు తగినంత బలం లేకున్నా సవాల్ ను స్వీకరించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
అంతలోనే తాను విసిరిన సవాల్ కు ఫలానా టైం లోపలే అవిశ్వాసం పెట్టాలంటూ మడత పేచీ పెట్టిన పవన్.. తర్వాత కామ్ అయ్యారు. మరోవైపు జగన్ 21న అవిశ్వాసం పెడతానని చెప్పి కాస్త ముందుకు జరిపారు. అవిశ్వాసం పెడితే దానికి అవసరమైన ఎంపీల మద్దతు కూడగడతానన్న పవన్ తర్వాతి కాలంలో మాట్లాడింది లేదు.
ఓపక్క జగన్ పార్టీ పెడుతున్న అవిశ్వాసానికి తాము మద్దతు పలుకుతామని చంద్రబాబు ప్రకటించి.. పల్టీ కొట్టారు. ఇంత జరుగుతున్న పవన్ మాత్రం నోరు విప్పలేదు. జగన్ పార్టీ పెట్టే అవిశ్వాసానికి మద్దతుగా బీజేపీయేతర పార్టీలు నిలవాలని మాట వరసకు కూడా మాట్లాడలేదు. ఎలాంటి స్టేటమ్ మెంట్ ఇవ్వకుండా ఆయన కామ్ అయిపోయారు. ఆవేశంతో గొంతు చించుకునే పవన్.. సరిగ్గా టైం వచ్చేసరికి నోట వెంట మాట రాని మూగవాని వలే కామ్ గా ఎందుకు ఉండిపోతున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పకతప్పదు.