Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ ను పిలిస్తే కానీ రారా?
By: Tupaki Desk | 22 Dec 2015 7:24 AM GMTరాష్ట్రాన్ని కుదిపేస్తున్న కాల్ మనీ వ్యవహారంలో అన్ని పార్టీలు స్పందిస్తుండగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం మనకెందుకులే అన్నట్లుగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఏపిలో జరుగుతున్న వరస సంఘటనలపై స్పందించడంలో పవన్ వెనుకంజ వేస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. విజయవాడలో మాజీ ఎమ్మె ల్యే మల్లాది విష్ణుకు చెందిన బార్ లో కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోయారు. ఆ సంఘటనపై బిజెపి సహా అన్ని పార్టీలూ స్పందించాయి. మహిళా సంఘాలు ఆందో ళన నిర్వహించాయి. మృతుల కుటుంబాలను పరామర్శించాయి. వైసీపీ అధినేత జగన్ కూడా వచ్చి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. కానీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటానన్న పవన్ మాత్రం, ఇప్పటివరకూ కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించలేదు... కాల్ మనీ దెబ్బకు అసెంబ్లీ దద్దరిల్లింది... రాష్ట్రమంతటా కలకలం రేగింది.. పవన్ కు మాత్రం ఇవేవీ తెలిసినట్లు లేదు. దీంతో పవన్ పై విపక్షాలు విమర్శల వేగం పెంచుతున్నాయి. ఆయన తనకు అవసరమైన ప్పుడు మాత్రమే తెరపైకి వస్తున్నారని, అది కూడా టిడిపి అనుమతి తీసుకుని, అంతకంటే ముందు చంద్రబాబును కలిసిన తర్వాతనే వస్తున్నారని విపక్షాలు విరుచుకుపడు తున్నాయి. రాజధాని రైతుల ఆందోళనలో పాలుపంచు కున్న పవన్, మళ్లీ కనిపించలేదు. తాజాగా మంత్రి కామినేని రాయబారం నడిపి ఆయనను ప్రత్యేక విమానంలో బాబు దగ్గరకు తీసుకువచ్చారు. ఆ తరువాత పవన్ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన చంద్రబాబు మనిషైపోయారన్న విమర్శలు వస్తున్నాయి.
గతంలోనూ పవన్ షూటింగుల్లో బిజీగా ఉండి వెంటనే స్పందించలేని పరిస్థితుల్లో ఉంటే కనీసం ట్విట్టర్ లో అయినా తన అభిప్రాయాన్ని పంచుకునేవారు. కానీ, ఈసారి మాత్రం ఆయన ట్వీటు కూడా చేయలేదు. పవన్ మౌనం బట్టి, ఆయనకు మహిళా సమస్యలపై సానుభూతి, గౌరవం లేకపోగా, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా బాధిత మహిళలలో బీసీలు, కాపులే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. అయితే... పవన్ పరిస్థితి ఎటూ మాట్లాడలేనట్లుగా ఉందని... అందుకే ఆయన మౌనంగా ఉన్నారని అంటున్నారు. గట్టిగా మాట్లాడితే టిడిపితో ఎక్కడ దూరం కావలసి వస్తోందనన్న మొహమాటం ఆయనలో ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఆయన ఈ సమస్యలను చూసీచూడనట్లుగా ఉంటూ నిద్ర నటిస్తున్నారని చెప్తున్నారు.