Begin typing your search above and press return to search.
సర్జికల్ స్టైక్స్ పై పవన్ కల్యాణ్ సైలెన్స్
By: Tupaki Desk | 27 Feb 2019 6:07 AM GMTపాకిస్థాన్ ఉగ్రమూకలపై దాడిచేసిన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. సాధారణ ప్రజల దగ్గరనుంచి సినీ - రాజకీయ ప్రముఖులంతా జైహింద్ అంటూ నినదించారు. భారత్ పాకిస్థాన్ కు సరైన రీతిలో బుద్ధి చెప్పిందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో రాజకీయ నాయకులు స్పందించడం షరా మామూలే. అంతెందుకు మోడీ అంటే అగ్గమీద గుగ్గిలం అయ్యే చంద్రబాబు - లోకేష్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అద్భుతం అంటూ పొగిడేశారు.
సినిమా సెలబ్రిటీలు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ - మహేశ్ - ఎన్టీఆర్ - రాజమౌళి - వర్మ - పూరీ జగన్నాథ్ ఇలా ప్రతీ ఒక్కరూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. కానీ ఒక్క హీరో తప్ప. అతనే పవన్ కల్యాణ్. సాధారణంగా ఏం చెప్పాలన్నా… ఎవరినైనా విమర్శించాలన్నా ట్విట్టర్ ద్వారానే రెస్పాండ్ అయ్యే పవన్.. నిన్న జరిగిన దాని గురించి స్పందించకపోవడం విడ్డూరమే. వేరే హీరోలతో పోలిస్తే పవన్ కు దేశభక్తి చాలా ఎక్కువ. ఆయన ట్విట్టర్ పేజీలో జైహింద్ అని ఎప్పుడూ కన్పిస్తూనే ఉంటుంది. కానీ నిన్న జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ గురించి మాత్రం స్పందించడానికి పవన్‌కు తీరికలేకుండా పోయింది. ప్రస్తుతం పవన్ రాయలసీమ జిల్లాలో పర్యటన చేస్తున్నారు. మరి పవన్ కు విషయం తెలియదా - లేదా ఆయన అనుచరులు ఎవ్వరూ చెప్పలేదా ఆనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.