Begin typing your search above and press return to search.
మరి.. లోకేశ్ ముచ్చట చెప్పవేం పవనా?
By: Tupaki Desk | 7 Dec 2017 1:30 AM GMTనీతులు చెప్పటం తప్పు కాదు. కానీ.. చెప్పే ముందు సాపేక్షంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందులోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అయితే.. ఆ బాధ్యత టన్నులు.. టన్నులు ఉండాలి. ఎందుకంటే.. సంప్రదాయ రాజకీయ అధినేతల మాదిరి పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడరు.
మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి మాట్లాడతానని చెబుతారు పవన్ కల్యాణ్. గుండెల్లో మండే మంటను మాటల్లోకి తీసుకొచ్చే విషయంలో ఎలాంటి తప్పు చేయనని.. తన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు తాను బాధ్యత వహిస్తానని చెబుతారు. అలవోకగా మాట్లాడే మాటల వెనుక పవన్ ఎంతగా శ్రమిస్తారో తెలిసినప్పుడు ఆశ్చర్యపోవాల్సిందే. మరి.. అంత శ్రమించి.. మధనం చేసిన తర్వాతే పవన్ నోటి నుంచి మాటలు వస్తున్నాయే అనుకున్నప్పుడు.. ఆయన మాటల్లో అంతుచిక్కని రీతిలో ఎందుకు ఉంటాయి?
లాజిక్‌కు అందని రీతిలో పవన్ మాటలు కనిపిస్తాయి. విశాఖలో పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్నే చూద్దాం. తన తండ్రి సీఎం అయితే కొడుకు సీఎం కావాలనుకోవటం నచ్చలేదంటూ వ్యాఖ్యానించారు. అరే..పవన్ ఏం చెప్పిండు? అంటూ సంకలు గుద్దుకునే వారు మర్చిపోయే విషయం ఏమిటంటే.. నీతులు చెప్పినట్లుగా మాట్లాడే జనసేనాధినేత టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ గురించి పల్లెత్తు మాట ఎందుకు అనరు?
అనుకోని రీతిలో ఇందిరమ్మ చనిపోయినప్పుడు.. ఆయన కుమారుడు రాజీవ్‌కు ఏకంగా దేశ పగ్గాలే అప్పజెప్పినప్పుడు.. ఊహించని రీతిలో వైఎస్ అకాల మరణం నేపథ్యంలో.. మెజార్టీ ప్రజాప్రతినిధుల అభీష్ఠానికి జగన్ ఓకే అనటం తప్పా? నిజానికి జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని నాటి కాంగ్రెస్ నేతలు సంతకాలు చేసిన వేళకు.. ఆయన ఎంపీ. అది కూడా ఆయన్ను ప్రజలు నేరుగా ఎన్నుకున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. ప్రజలు ఎన్నుకున్న ఒక ఎంపీగా ఉన్న జగన్ సీఎం కావటం తప్పని చెబుతున్న పవన్.. ఎలాంటి ఎన్నిక లేకుండా చేతిలో ఉన్న అధికారంతో.. మంది బలంతో మంత్రిని చేసేయటాన్ని ఎందుకు తప్పు పట్టరు? అంతేనా.. నారాయణ లాంటి వ్యాపారవేత్తకు ఎలాంటి రాజకీయ రంగ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. ప్రజలు ఎన్నుకోకున్నా నేరుగా తీసుకొచ్చి మంత్రి కుర్చీలో కూర్చోపెట్టటాన్ని ఎందుకు ప్రశ్నించరు. తనకు నచ్చని విషయాన్ని చెప్పేస్తున్న పవన్.. ఆ నచ్చని దాన్లో కూడా లాజిక్ లేకపోవటం చూస్తే.. ఆయన మాటల్లోని డొల్లతనం ఇట్టే కనిపిస్తుంది. ఇదంతా చూస్తున్నప్పుడు నచ్చినోళ్లు ఏం చేసినా వోకే.. నచ్చనోళ్లు ఏం చేయకున్నా కూడా నచ్చకపోవటం ఏమిటో?