Begin typing your search above and press return to search.
ఢిల్లీకి వెళతానన్నారు..ఇప్పుడు మీరెక్కడ పవన్?
By: Tupaki Desk | 20 July 2018 7:31 AM GMTమోడీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెట్టండి. నేను స్వయంగా ఢిల్లీకి వెళతా. ఏపీకి జరిగిన అన్యాయంపై మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలను కలుస్తా. అందరి మద్దతు కూడగడతానంటూ ఆ మధ్యన జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ స్టేట్ మెంట్ ఇవ్వటం గుర్తుందా?
మైకు కనిపించినా.. తన అభిమాన గణం ఎదురున్నా.. తానేం మాట్లాడుతున్నానో గుర్తు పెట్టుకోలేనట్లుగా ఆవేశంతో మాట్లాడే పవన్ మాటలన్ని పాలపొంగులా ఉంటున్నాయే తప్పించి.. వాటికి ఎలాంటి ప్రాధాన్యత ఉండటం లేదు. ఏపీ అధికారపక్షం మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది.
మరి.. దీనిపై మాట్లాడటం.. ప్రత్యేక హోదా అంశంపై మోడీ చేసిన హామీలు.. చెప్పిన మాటల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఏదో తూతూ మంత్రంగా ట్విట్టర్ లో ఒక సందేశాన్ని పోస్టు చేసేసి పని అయిపోయిందన్నట్లుగా వ్యవహరించటం తగని పని.
ఏపీకి ముఖ్యమంత్రి కావాలన్న ఆశను.. ఆసక్తిని ఈ మధ్యన ప్రదర్శిస్తున్న పవన్ కల్యాణ్.. అందుకు ముందు తనకు అర్హత ఉందన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించాల్సిన అవసరం ఉంది. ఏపీకి మోడీ సర్కారు చేసిన అన్యాయంపై గుక్క తిప్పుకోకుండా అన్నట్లు తన వాదనను వినిపించిన గల్లా మాదిరి పవన్ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. అదేమీ లేకుండా.. అప్పుడప్పుడు ముక్కున పెట్టుకున్నట్లుగా మాట్లాడటంతో ఏపీకి ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని పవన్ గుర్తిస్తే మంచిది.