Begin typing your search above and press return to search.

పవన్ తో అలీ...నిజమేనట...?

By:  Tupaki Desk   |   28 Sep 2022 12:52 PM GMT
పవన్ తో అలీ...నిజమేనట...?
X
ప్రముఖ సినీ కమెండియన్ అలీ రాజకీయ యాత్రలో మరో కొత్త అంకానికి త్వరలో తెర తీస్తారని అంటున్నారు. తాను ఉంటున్న వైసీపీకి అలీ తొందరగా గుడ్ బై కొట్టేసి తన సినీ మిత్రుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరుతారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అలీ నిజానికి పవన్ కి మంచి మిత్రుడు. ఆయనతో కలసి ఎన్నో సినిమాల్లో వేశారు. పవన్ ప్రతీ సినిమాలో పక్కన అలీ ఉండాల్సిందే.

అంతటి బ్యాండేజ్ ఈ ఇద్దరు మధ్యన ఉండగా మధ్యలో వచ్చిన రాజకీయం అతి పెద్ద చిచ్చు పెట్టింది. 2019 ఎన్నికలకు ముందు అలీ జగన్ ని కలసి వైసీపీలో చేరడంతో పవన్ షాక్ తిన్నారు. తన పార్టీలో అలీ చేరుతారు అనుకుంటే ఇలా చేశారేంటి అని పవన్ సన్నిహితుల వద్ద ఆవేదన చెందారని కూడా చెబుతారు.

అంతటితో ఆగని అలీ వైసీపీ వైపు నుంచి జనసేనాని మీద పదునైన విమర్శల బాణాలే సంధించారు. తాను సొంతంగా సినీ పరిశ్రమలో పైకి వచ్చానని అంటూ ఇండైరెక్ట్ గా పవన్ చిరంజీవి చలవతో ఎదిగారని హాట్ కామెంట్స్ చేశారు. ఆ తరువాత ఇద్దరి మధ్యన ఎడం పెరిగింది. 2019 తరువాత పవన్ మళ్లీ సినిమాలు చేస్తున్నారు కానీ ఎక్కడా అలీని తీసుకోలేదు.

పవన్ ఈ విషయంలో అలీ మీద చాలా ఆగ్రహంగానే ఉన్నారని అంటున్నారు. అయితే రాజకీయాల్లో అవేమీ ఎల్లకాలం ఉండవు. అలీకి వైసీపీలో ఫ్యాన్ నీడన బాగా ఉక్కబోతగా ఉంది అంటున్నారు. పైగా వైసీపీ తరఫున నామినేటెడ్ పదవి అయినా దక్కుతుంది అనుకుంటే ఏదీ లేకుండా పోయింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ ఇస్తారని ప్రచారం జరిగింది అదీ లేదు, ఆ మధ్యన రాజ్యసభ సీటు ఇస్తారని కూడా మీడియా కోడై కూసింది అదీ లేదు.

దాంతో అలీ పూర్తిగా నిరాశకు గురి అయ్యారని అంటున్నారు. ఇది ఆయన ఆవేదన అయితే అలీ సొంత ప్రాంతం తూర్పు గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉంది. కొన్ని సీట్లను కూడా గెలుచుకుంటుదని అంచనాలు ఉన్నాయి. దాంతో రాజమండ్రీకి చెందిన అలీ అక్కడ నుంచి పోటీ చేయడానికి జనసేనలో చేరవచ్చు అని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ మేరకు ఆయన ఇప్పటికే పవన్ తో గ్యాప్ ని తగ్గించుకునే పనిలో పడ్డారని అంటున్నారు. అలీ జనసేనలో చేరుతారు అంటూ సోషల్ మీడియాలో అయితే వార్తలు మాతం జోరుగా వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కి కూడా సినీ నటుల మద్దతు కావాలి. ఇప్పటికే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వైసీపీ నుంచి బయటకు వెళ్ళి పవన్ని సమర్ధిస్తున్నారు.

ఇపుడు అలీ కూడా జనసేన గూటికి చేరితే ఆయనను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అలీ అంటే కేవలం అభ్యర్ధి మాత్రమే కాదు జనసేన ప్రచారకర్తలలో ఒకరుగా ఉంటారు కాబట్టి పవన్ కి ఏ రకమైన అభ్యంతరం లేకపోవచ్చు అని అంటున్నారు. తాను కోరుకున్న రాజమండ్రీ కాకపోయినా తూర్పు పశ్చిమ జిల్లాలో ఏదో ఒక సీటు నుంచి అయినా పోటీ చేయడానికి అలీ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న అలీ రెండు దశాబ్దాల కల జనసేన ద్వారా తీరుతుందని అనుకోవాలా అంటే దానికి కాలమే జవాబు చెప్పాలి. జనసేన ఇతర పార్టీలతో పొత్తులు ఖరారు అయ్యాయ అలీ తన చేరిక మీద అడుగులు వేగంగా వేసే అవకాశం ఉంది అని అంటున్నారు. సో అలీ వైసీపీకి దూరమవుతున్నారా అంటే అలాగే అనుకోవచ్చు అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.