Begin typing your search above and press return to search.

ఇంత బాధ్య‌తారాహిత్య‌మా ప‌వ‌న్‌?

By:  Tupaki Desk   |   3 Nov 2018 6:14 AM GMT
ఇంత బాధ్య‌తారాహిత్య‌మా ప‌వ‌న్‌?
X
ఈ రోజు ఎక్క‌డ చూసినా సెల్పీల గోలే. ప్రముఖులు మొద‌లు సామాన్యుల వ‌ర‌కూ ఎవ‌రైనా స‌రే అంద‌రూ సెల్పీల మోజులో త‌రిస్తున్నారు. ఇదంతా ఎక్క‌డ నుంచి వ‌చ్చింద‌న్న‌ది చూస్తే.. మోడీ మాష్టారు నుంచ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌న చేతిలోని మొబైల్‌తో అంత‌ర్జాతీయ ప్ర‌ముఖుల‌తో క‌లిసి దిగిన సెల్ఫీలు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే వైర‌ల్ గా మారింది. ఈ రోజు ఈ సెల్ఫీల పిచ్చ ఇంత‌గా పెరిగిపోవ‌టానికి ఆద్యులు ప్ర‌ముఖులే.

ప్ర‌ముఖులు చేసే ప‌నిని ఇట్టే ఫాలో కావ‌టం సామాన్యుల‌కు ఒక అల‌వాటు. ఇదిప్పుడు ఎంతో మంది ప్రాణాల మీద‌కు తీసుకొస్తున్న ప‌రిస్థితి. ఒక్క సెల్ఫీలు మాత్ర‌మే కాదు.. వెండితెర వేల్పులు.. సెల‌బ్రిటీలు.. ప్ర‌ముఖులు ఎవ‌రైనా స‌రే..వారు ఏదైనా భిన్న‌మైన ప‌ని చేస్తే అది కాస్తా ప్ర‌ముఖంగా రావ‌టం.. దాన్ని ఫాలో కావ‌టం చేస్తుంటారు.

నిత్యం నీతులు చెబుతూ.. తన‌లాంటి బాధ్య‌త క‌లిగిన వ్య‌క్తి ఎవ‌రూ ఉండ‌ర‌న్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇచ్చే ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజా ఫోటో చూస్తే షాక్ తినాల్సిందే.

తాజాగా ఒక ట్రైన్ లో ప్ర‌యాణించి.. ప్ర‌యాణికుల‌తో క‌లిసి వారి స‌మ‌స్య‌ల గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసిన ప‌వ‌న్‌.. త‌ర్వాత ట్రైన్ బోగీ త‌లుపు ద‌గ్గ‌ర కూర్చున్న వైనం ఫోటోల రూపంలో వైర‌ల్ అయ్యింది. ట్రైన్ డోర ద‌గ్గ‌ర‌.. ఫుట్ పాత్ మీద కూర్చున్న ప‌వ‌న్ బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు.. యూత్ ప్ర‌మాదాల బారిన ప‌డేలా చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఆ మాట‌కు వ‌స్తే.. ట్రైన్ డోర్ ద‌గ్గ‌ర కూర్చోవ‌టం చ‌ట్ట‌ప్ర‌కారం నేర‌మ‌ని చెబుతారు. కొన్ని రైళ్ల‌లో విప‌రీత‌మైన ర‌ద్దీతో కిట‌కిట‌లాడే వేళ‌లో బోగీ డోర్ల ద‌గ్గ‌ర వేలాడే ప‌రిస్థితి ఉంటుంది. కొంత‌మంది రైల్వే అధికారులు ఇలాంటి వారికి ఫైన్ వేస్తుంటారని చెబుతారు. అవ‌స‌రం కోసం ఉన్న వారి మీదే జ‌రిమానాలు వేయ‌టం ద్వారా ఆ చ‌ర్య చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌ది కాద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తుంటారు.

మ‌రి.. అలాంట‌ప్పుడు ప‌వ‌న్ లాంటి బాధ్య‌త క‌లిగిన వ్య‌క్తి ట్రైన్ డోర్ ద‌గ్గ‌ర కూర్చోవ‌టం ద్వారా ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్న‌ట్లు. త‌న‌ను అభిమానించే వారు.. ఆరాధించేవారు.. పిచ్చిగా ప్రేమించేవారు.. ఫాలో అయ్యే వారంద‌రికి త‌మ అభిమాన న‌టుడు చేసిన ప్ర‌య‌త్నాల్ని చేస్తే.. దాని కార‌ణంగా చోటు చేసుకునే ప్ర‌మాదాల‌కు ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తారు? ఒక ప్ర‌ముఖుడు ఏదైనా ప‌ని చేస్తే.. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రెట్టించిన ఉత్సాహంతో మ‌రింత ఎక్కువ‌గా చెల‌రేగిపోవ‌టం మామూలే. ఇదే క్ర‌మంలో ప‌వ‌న్ ఫోటోకు స్ఫూర్తి చెందిన అత్యుత్సాహంతో ఫీట్లు చేసే వారి విష‌యాన్ని ప‌వ‌న్ ఎందుకు ఆలోచించ‌న‌ట్లు? తాను సామాన్యుడిలా ఉండాల‌నుకుంటే.. త‌న‌ను గుర్తు ప‌ట్ట‌ని రీతిలో త‌యారై.. ఎలాంటి భ‌ద్ర‌త లేకుండా సాధార‌ణ ప్ర‌యాణికుడిలా ఏదైనా ప్యాసింజ‌ర్ ట్రైన్ లో ప్ర‌యాణించ‌టం ద్వారా త‌న మ‌న‌సు ముచ్చ‌ట‌ను తీర్చుకోవ‌చ్చు. ఇది కూడా కాదంటే.. ఏ ఉత్త‌రాదికో.. ఈశాన్య ప్రాంతానికో వెళితే అస్స‌లు గుర్తు ప‌ట్ట‌రు. అది మానేసి.. ప్ర‌చారం కోస‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే తీరు ఏ మాత్రం స‌రికాదన్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.