Begin typing your search above and press return to search.

పవన్ - భగత్ సింగ్ మాట.. అసలు కథ ఇదే..

By:  Tupaki Desk   |   17 Dec 2018 11:55 AM GMT
పవన్ - భగత్ సింగ్ మాట.. అసలు కథ ఇదే..
X
అల్లుడు లోకేష్ బాబు భాష పఠిమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అది తెలుగు నాట ఎంతో వైరలే.. ఇక మామ ఇటీవల కూకట్ పల్లి ప్రచారంలో చేసిన ‘సారే జహాసే అచ్చా.. హమ్ బుల్ బుల్’ అనే డైలాగ్ వీడియోను ఏకంగా కేటీఆర్ షేర్ చేసి ‘‘ఇది ఇప్పట్లో ఫుల్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్’’ అంటూ కొటేషన్ ఇచ్చేశాడు. తమ లాగే అందరూ ఉంటారని.. మాట్లాడుతారని బహుషా వాళ్లు కాచుకు కూర్చున్నట్టున్నారు.. తాజాగా పవన్ కళ్యాణ్ పొరబడి అన్న మాటలను సగం వరకు కట్ చేసి చూపిస్తూ కొందరు పవన్ కళ్యాణ్ వ్యతిరేక సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆయన్ను దిగజార్చే చర్యలకు పాల్పడుతున్నారు.

పవన్ కళ్యాణ్ తాజాగా అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ఓ సభలో మాట్లాడిన మాటలను సగం వరకు కట్ చేసిన కొందరు పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు ఆయన్ను అభాసుపాలు చేసే కుట్రకు తెరదించారు. పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ ‘భగత్ సింగ్ చరిత్ర చూస్తే.. 23 ఏళ్ల వయసులో దేశం కోసం భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు..’ అని నోరుజారాడు. ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకునేందుకు వెంటనే ‘బ్రిటీష్ వాళ్లు ఉరేసారు.. అంత వయసులో ప్రాణాలు తీసుకునే ధైర్యం ఎవరికుంటుంది.. ..దేశం కోసం.. స్వాతంత్ర్యం కోసం ఇలా ఎంతమంది చేస్తారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం’అని పొరపడిన మాటను పవన్ సరిచేసుకున్నాడు.

కానీ కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు పవన్ మాట్లాడిన వీడియోలోని మొదటి 12 సెకన్ల వీడియోను కట్ చేసి వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. ఈ వీడియోలో భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు అని పవన్ పొరబడిన మాటను సర్క్యూలేట్ చేస్తున్నారు..వీడియోను అక్కడి వరకే కట్ చేసిన ఆయన ప్రత్యర్థులు.. ఆ తర్వాత పవన్ ఇచ్చిన వివరణను మాత్రం చూపించడం లేదు. ‘భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడట’ అని పవన్ అన్నాడన్న వీడియోను చూపిస్తూ పవన్ పై కొందరు బురదజల్లుతున్నారు.. భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు అన్న తర్వాత దేశం కోసం ఇలా ప్రాణత్యాగాలు చేసే ధైర్యం ఎంతమందికి ఉంటుందన్న డైలాగును మాత్రం ఎవ్వరూ చూపించకపోవడం గమనార్హం.

పవన్ కళ్యాణ్ మాటా తూలాడంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ప్రచారంలోకి తీసుకొచ్చారు. పవన్ ఎంతో ఉన్నతాశయంతో భగత్ సింగ్ స్ఫూర్తిని కొనియాడడంలో దొర్లిన తప్పును ఎత్తిచూపుతూ రాజకీయం చేస్తున్నారు. దానిలోని వివాదాన్నే వెతుకుతున్నారు తప్పితే.. పవన్ స్ఫూర్తిని మాత్రం ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం.

వీడియో కోసం క్లిక్ చేయండి